ప్రతి తల్లి తన కూతురు వివాహానికి ముందే ఈ విషయాలు నేర్పించాలి..!
Publish Date:Nov 18, 2025
Advertisement
బాధ్యత.. ఆడపిల్ల పెళ్లి తర్వాత ప్రతి పనిని తన బాధ్యతగా భావించడం నేర్పాలి. ఇంటిని మెయింటైన్ చేయడం అయినా లేదా తనను తాను చూసుకోవడం అయినా, పెళ్లి తర్వాత ఆడపిల్లలు అన్నీ చేయగలగాలి. తన అవసరాలను తాను తీర్చుకోగలగాలి. తన సమయాన్ని తాను ప్లానింగ్ గా చూసుకోవాలి. స్వావలంబన కలిగిన స్త్రీ ప్రతి పరిస్థితిలోనూ బలంగా ఉంటుంది. అంటే ఇంటి పని అయినా, తన పనులు అయినా, ఇతర విషయాలు అయినా.. తాను చేయగలిగేవి తాను చక్కగా చేసుకుంటే.. ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటే.. ప్రతి మహిళ మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతుంది. వంట రావాలి.. నేడు ఇళ్లలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో లేదా వంట మనుషులు, పని మనుషుల సహాయంతో జరుగిపోతుంటాయి. కానీ రుచికరమైన, పోషకమైన ఆహారాన్ని వండటం ఒక కళ. ఆహారం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు, సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఒక మార్గం అని ప్రతి తల్లి తన కూతురుకి చెప్పాలి. తనకు నచ్చిన వంట చేసుకుని తినడమే కాకుండా కుటుంబ సభ్యులకు నచ్చిన ఆహారాన్ని వండి పెట్టడంలో కూడా మనుషుల మద్య బందాలు బలపడటానికి సహాయపడుతుంది. మాట, సహనం.. మాట్లాడటం అనేది వివాహ జీవితానికి పునాది. ప్రతి విభేదాన్ని వాదన ద్వారా కాకుండా ఆరోగ్యకరంగా మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రతి కూతురికి తల్లి నేర్పించాలి. తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూనే ఇతరుల అభిప్రాయాలను వినడం, గౌరవించడం నేర్చుకోవడం ముఖ్యం. అత్తమామల ఇంట్లో మాట్లాడటం, వారు చెప్పినది ఓపికగా వినడం, అర్థం చేసుకోవడం వంటి విషయాలు సజావుగా ఉన్నప్పుడే అత్తారింట్లో ఆడపిల్ల అనుబంధం బాగుంటుంది. ఆర్థిక అవగాహన, పొదుపు.. వివాహానికి ఆర్థిక స్వాతంత్ర్యం బలమైన స్తంభం అవుతుంది. చిన్న పొదుపులు, బడ్జెట్ లాగా ప్లాన్ చేసుకుని ఖర్చు పెట్టడం, ఖర్చులను ప్లానింగ్ ప్రకారం ఉంచుకోవడం, ఆర్థిక విషయాలలో మంచి అవగాహన కలిగి ఉండటం వంటివి ప్రతి ఆడపిల్లను అత్తారింట్లో గౌరవంగా నిలబెడతాయి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్.. పెళ్లైపోగానే ఆడపిల్ల తన ఐడెంటిటీ కోల్పోకూడదు. తన ప్రాధాన్యతలు, తన పట్ల తను బాధ్యతగా ఉండటం, తన కోసం తాను సమయాన్ని కేటాయించుకోవడం, సెల్ఫ్ లవ్ కలిగి ఉండటం, నిర్ణయాలు తీసుకోవడంలో బలంగా ఉండటం, తనను ఇబ్బంది పెట్టే పనులు, విషయాలకు సున్నితంగా నో చెప్పడం వంటివి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి. ఇవన్నీ పెళ్లికి ముందు తన కూతురికి నేర్పించడం ప్రతి తల్లి బాధ్యత. *రూపశ్రీ.
ఈ ప్రపంచంలో చాలా పవిత్రతను, ప్రత్యేకతను కలిగి ఉండేది వైవాహిక బంధం. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వివాహంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండటం ఈ బంధానికి చాలా ప్రాధాన్యతను తెచ్చి పెడుతుంది. సహజంగా పెళ్లి అంటే చాలా హడావిడి జరుగుతుంది. నిశ్చితార్థం, షాపింగ్, శుభలేఖలు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, హనీమూన్ వరకు.. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా జరగాలని కోరుకుంటారు నేటి తరం అమ్మాయిలు, అబ్బాయిలు. అయితే ప్రీ వెడ్డింగ్ పోటో షూట్ ల గురించి చర్చలు జరిపినా, జరపకపోయినా.. ప్రతి తల్లి పెళ్ళికి ముందు తమ కూతుళ్లకు కొన్ని విషయాలు తప్పక నేర్పించాలని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. వైవాహిక బంధాలు చాలా తొందరగా విచ్చిన్నం అవుతున్ననేటికాలంలో ఈ విషయాలు బందాలను నిలబెట్టే పునాదులు అవుతాయని కూడా అంటున్నారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే..
http://www.teluguone.com/news/content/every-mother-should-teach-her-kid-these-things-before-marriage-35-209714.html





