తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో జనం సాయంత్రమైతే చాలు బయటకు అడుగుపెట్టాలంటేనే వణుకుతున్న పరిస్థితి. ఉదయం 9గంటల సమయంలో కూడా చలి పులి పంజా విసురుతున్నది.
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో సోమవారం (డిసెంబర్ 8) అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మెదక్ జిల్లా శివ్వంపేటలో 8.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చలి పంజా విసురుతోంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది.
ఇక హైదరాబాద్ నగరం సైతం చలిగుప్పెట్లో వణుకుతోంది. నగర పరిధిలోనూ పలు ప్రాంతాలలో సింగి ల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. శేరిలింగంపల్లిలో ఆదివారం రాత్రి 8.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cold-wave-in-telangana-36-210717.html
వచ్చింది. ఈ మెయిల్ సీఎంవో మరియు లోక్ భవన్‌ను వెంటనే ఖాళీ చేయాలని, పెద్ద ప్రమాదం సంభవించబోతోందన్న హెచ్చరిక ఉంది. ప్రభుత్వ ప్రముఖులు, వీఐపీలు ప్రాణాపాయంలో ఉంటారని ఆ మెయిల్ హెచ్చరించింది.
భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటరుగా నమోదు చేసుకున్నారని పిటిషనర్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది.
డాన్ బ్రాడ్ మన్ పేరిట ఎన్నో ఏళ్లుగా ఉన్న హయ్యస్ట్ టెస్ట్ సెంచరీల రికార్డును మన లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ బద్దలు కొట్టాడు. ఆ గావస్కర్ రికార్డును మన సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. అలాగే టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు
350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్ ఈ నెల 16 మధ్యాహ్నం అబుదాబీలో జరగనుంది అని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన మెయిళ్లలో బీసీసీఐ పేర్కొంది.
మంగళవారం దేశ వ్యాప్తంగా ఇండిగో సంస్థకు చెందిన వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, విమానాశ్రయానికి రావాల్సిన 58 విమాన సర్వీసులు ఉన్నాయి.
విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ కోసం జడ్ స్కాలర్ ఆధ్వర్యంలో ఆర్ & డి సెంటర్, డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయాలని మంత్రి లోకేష్ జే చౌదరిని కోరారు.
శంషాబాద్ నుంచి అమెరికా కు వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టాననీ, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో పేలుస్తానని ఆ ఈమెయిల్ లో జాస్పర్ పకార్ట్ పేర్కొన్నాడు. అంతే కాకుండా, బాంబులు పేలకుండా ఉండాలంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ రింగ్ రోడ్డు సీఎం కాన్వాయ్ లోని జామర్ వాహనం వెనుక టైర్ పేలిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్వవహరించి వాహనాన్ని పక్కకు మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఐబొమ్మ రవిపై నమోదైన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున కోర్టు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాల నిపుణులు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపారు.
వీధి కుక్కలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలను చంపేసిన సంఘటనలు బయోత్పాన్నే సృష్టిస్తున్నాయి.
ఢిల్లీ హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు.
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని..ఆదాయం తగ్గినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.