జగ్గారెడ్డి ఎత్తుకు రేవంత్‌రెడ్డి పైఎత్తు .. జగ్గన్న దీక్షకు బ్రేక్..

Publish Date:Jan 16, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీలో ముఠా తగాదాలు,అంతర్గత కుమ్ములాటలు మామూలు వ్యవహరం. చేతికి ఉన్న ఐదేళ్లు ఎలా అయితే, సమానంగా ఉండవో, అదేవిధంగా హస్తం పార్టీలో అందరూ ఒకే మాట మీద ఉండరు. తెలంగాణలో అయితే, ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగానే శ్రుతిమించి రాగాన పడింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన దగ్గర నుంచి, సీనియర్ నాయకులు చిర్రుబుర్రులాడుతూనే ఉన్నారు.చాప కింద నీరులా అసమ్మతి సెగ రాజేస్తునే ఉన్నారు.  

అయితే, చిత్రంగా గత పక్షం రోజులకు పైగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి మధ్య మీడియా వేదికగా సాగిన యుద్ధం టీ కప్పులో తుపానులా సమసి పోయింది. కనీసం అలాంటి భ్రమలు అయితే బాగానే వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పెద్దలను గౌరవించడం లేదని, ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జగ్గా రెడ్డి లేఖ రాశారు. అంతే కాకుండా, రేవంత్ రెడ్డిని తమ దారికి అయినా తీసుకు రావాలి లేదంటే ఆయన్ని తీసేసి అందరినీ కలుపుకుపోయే వారికి పీసీసీ పీఠం అప్పగించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ పెద్ద దుమారమే రేపింది. దానిపై సాగిన మాటల  యుద్ధం,ఒకరిపై ఒకరు  కోవర్ట్ ఆరోపణలు చేసుకునే వరకి కూడా వెళ్ళాయి.  ఇలా ఆ ఇద్దరి మధ్య రేగిన రగడ ఇంకా చాలా దూరం పోతుందనే రాజకీయ పరిశీలకులు భావించారు.
అందుకు తగ్గట్టుగానే,జగ్గారెడ్డి, పీసీసీతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి మీద ప్రత్యేక పంధాలో యుద్దాన్ని ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబందించిన 307 జీఓ  సమస్యతో సహా పలు అంశాలపై చర్చినేందుకు ఈ నెల 17కు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోరారు. అప్పాయింట్మెంట్ ఇవ్వకపోతే అదే రోజున జగ్గారెడ్డి ప్రగతి భవన్ వద్దనే దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే, జగ్గారెడ్డి ఎత్తుగడను ముందుగానే పసిగట్టిన రేవంత్ రెడ్డి, వ్యూహాత్మకంగా పావులు కదిపి జగ్గారెడ్డి ఎత్తును చిత్తూ చేశారు. జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష బదులు ఉమ్మడి పోరాటం చేయాలని పీసీసీ నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన జూమ్ మీటింగ్‌లో జగ్గారెడ్డి దీక్ష స్థానంలో సీఎల్పీ నేతలు ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 17వ తేదీన జగ్గారెడ్డి పలు అంశాలపై చేయాలనుకున్న దీక్షను వాయిదా వేసుకోవాలని, ఆ స్థానంలో సీఎల్పీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయాలని.. సీఎం అపాయింట్‌మెంట్ అడగాలని నిర్ణయించారు.ఒకవేళ సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ఉమ్మడిగా పోరాటం చేయాలని సీఎల్పీ సమావేశం నిర్ణయించింది. అంటే పీసీసీకి రేవంత్ రెడ్డికి సమాంతరంగా ఆందోళనలు చేసేందుకు జగ్గారెడ్డి చేసిన తొలి ప్రయత్నాన్నే రేవంత్ రెడ్డి తుంచేశారని అంటున్నారు.రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆరోపిస్తూ సోనియా గాంధికి లేఖ రాసినా జగ్గా రెడ్డిని  రేవంత్ రెడ్డి అదే వ్యూహంతో దెబ్బ కొట్టారు. అందుకే తేలు కుట్టిన దొంగలా, జగ్గా రెడ్డికి ఉమ్మడి పోరాటానికి అంగీకరించక తప్ప లేదని, అంటున్నారు. అయితే, బలవంతపు బ్రాహ్మణార్ధం బాపతు ఐక్యత ఎంతకాలం ఉంటుంది అనేదే అసలు ప్రశ్న.. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ... ఎండమావిలో నీరు.. ఉన్నట్లు కనిపిస్తాయే కానీ, ఉండవు.

By
en-us Political News

  
సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు.
ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది. ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని, ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది.
శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే.
ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా?
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది.
ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు.
రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు, ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు.
కేసీఆర్ కట్టడం కూలిందంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో వున్న కట్టడం కూలిందనో, హైదరాబాద్ నంది నగర్లో ఆయనకు
తిమ్మిని బమ్మిని చేసి, మాటలతో మాయ చేసే తండ్రి సపోర్టు బాగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా నడిచింది.
శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.