Publish Date:Jan 18, 2025
నిన్నమొన్నటి వరకూ ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు పిల్లలు తప్పనిసరి చేస్తూ కొత్త చట్టం తీసుకురానున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అసలుఎన్నికలకు,పిల్లలకు సంబంధం ఏమిటనే ప్రశ్న రావడం సహజం. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో జనాభా రేటు తగ్గిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి విధంగా కొనసాగితే జనాభా నిష్పత్తిలో నియోజక వర్గాలు పునర్వ్యవస్థీకరణ జరిగితే ఉత్తరాది లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు దక్షిణాదిలో నియోజకవర్గాల సంఖ్య తగ్గే పరిస్థితి కనపడుతున్నది. ఫలితంగా ఎన్నికలో ఉత్తరాది డామినేషన్ ఉన్న రాజకీయ పార్టీలకే పార్లమెంటులో అధికారం సిద్దించే అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. దక్షిణాదిలో జనాభా రేటు పెరగాలని అందుకు తామ మద్దతు ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ గతంలోనే ప్రకటించారు.
ఇప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఆ మేరకు కనీసం ఇద్దరు పిల్లలు ఉన్నవారికే స్థానిక సంస్థల్లో పోటీకి అర్హత గా నిర్ణయిస్తూ చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సంపద పెంపు, ఆదాయం వృద్ధిలో పాటు జనాభా రేటులో పెరుగుదలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. జనాభా పెరుగుదల రేటు ఇలాగే ఉంటే 2026లో ఏపీ జనాభా 5.38 కోట్లు మాత్రమే ఉంటుంది. అదే 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుంది. ప్రతి జంటకు సగటున 2.1 పిల్లలు జన్మిస్తే జనాభా సక్రమ నిర్వహణ సాధ్యమ వుతుందన్న అంచనాలు ఉన్నాయి.
భవిష్యత్ అవసరాల కోసం భారీగా రోడ్ల విస్తరణ,విమానాశ్రయాలు ఏర్పాటు తో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టనున్న తరుణంలో జనాభాలో పెరుగుదల లేకపోతే వాటి వినియోగం ప్రశ్నార్ధకం గా మారే ప్రమాదం ఉంది. రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా అభివృద్ధి చేసి సకల సౌకర్యాలు కల్పించే ప్రణాళికలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు,ఇతర సంస్థలు ఏర్పాటు కానున్నాయి. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు కూడా పీపీపీపీ పద్ధతిన నిర్మించాలని ఏపీ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది.
రాజకీయంగా దక్షిణాది కి సమున్నత స్థానం కల్పించాలంటే జనాభా పెరగాలని చంద్రబాబు చెబుతున్నారు. పిల్లలు కనండి...స్థానిక సంస్థల్లో పదవులు పోందండి అంటే ప్రజలు పిల్లల్ని కనలేరు. వారి ఆదాయ మార్గాలు పెంచాలి.ఉ పాధి పెరగాలి. అవి రెండూ పెరిగేలా తాను బాధ్యత తీసుకుంానని చంద్రబాబు చెబుతున్నారు.
ఉపాధి పెరగాలంటే విద్యావిధానం మారాలి.వృత్తి విద్యా కోర్సులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పాలిటెక్నిక్, పారిశ్రామిక శిక్షణా సంస్థలు,నర్సింగ్ కోర్సులు, నైపుణ్యం పెంచే శిక్షణా సంస్థలు, కంప్యూటర్ ఆపరేటర్ల కోర్సులు వంటి వాటిని ప్రోత్సహించాలి. ప్రస్తుతం ఏపీలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ ఆ పనే చేస్తున్నది. దక్షిణాదికి రాజకీయ ప్రాధాన్యత, ప్రాముఖ్యత పెరగడం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-to-bring-new-act-39-191471.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.