Read more!

రూ.10కే బిర్యానీ.. రండి బాబు రండి..

మంచి బిర్యానీ తినాలంటే  మినిమమ్ 150 నుండి రెండు వందలు ఉండాలి.. స్టార్ హోటల్స్  లో ప్రైజ్ అయితే ఇక చెప్పనక్కర్లేదు.. 10 రూపాయలకు మంచి టీ కూడా దొరకని ఈ రోజుల్లో 10 రూపాయలకే బిర్యానీ దొరుకుతుందంటే నమ్ముతారా.. మీరు నమ్మిన నమ్మకపోయినా 10 రూపాయలకు బిర్యానీ  మాత్రం వాస్తవము..

 ఆ ఏరియాలో  బస్సులు వస్తుంటాయి, వెళ్తుంటాయి. ప్రజలు బిజీ బిజీగా తిరుగుతుంటారు. భోజనం చేసే సమయానికి  ఓ బిర్యానీ షాప్ దగ్గర జనం గుమ్మికూడుతారు.  10 రూపాయలకే  వేడి వేడి వెజిటబుల్ బిర్యానీ కొనుక్కుంటున్నారు. హాయిగా తింటున్నారు. అదే అస్కా బిర్యానీ స్టాల్.

హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ బస్టాప్ దగ్గరకు వెళ్లి... ఈ స్టాల్ పేరు చెప్పి అడ్రెస్ అడిగితే చూపిస్తారు. చూడ్డానికి పాత హోటల్‌లా ఉంటుంది. పదేళ్ల నాటిది మరి. రోజంతా ప్లేట్ బిర్యానీని రూ.10కే అక్కడ అమ్ముతున్నారు. ఉదయం 7 గంటలకే తెరిచి... అర్థరాత్రి వరకూ అందుబాటులో ఉంచుతారు. పేదవాళ్లు, రోజువారీ కూలీలకు ఈ హోటల్ ప్రాణం పోస్తోంది.

తలాబ్ కట్ట దగ్గర నివసిస్తున్న ఇఫ్తికార్ మొమిన్... ఈ ఫుడ్ స్టాల్‌ను ఓ టేబుల్... కొన్ని గిన్నెలతో పదేళ్ల కిందట ప్రారంభించారు. అప్పట్లో ఇదే వెజ్ బిర్యానీని రూ.5 చొప్పున అమ్మారు. ధరలు పెరుగుతుంటే... ఆయన కూడా కాస్త పెంచుతూ ప్రస్తుతం రూ.10 చేశారు. ఇలాంటి స్టాల్స్‌ని ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కోటి ఉమెన్స్ కాలేజీ బస్టాప్, అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ప్రారంభించి నడిపిస్తున్నారు.