Read more!

గంజాయి బ్యాచ్‌తో దాడి!.. వాళ్లు ఆ నాయ‌కుడి అనుచ‌రులేనా?

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌పై దాడి చేసి బీభ‌త్సం సృష్టించారు. ఈ దాడి చేసిన వారిపై టీడీపీ ఫిర్యాదు చేసినా.. ఇంత వ‌ర‌కూ ఎవ‌రినీ అదుపులోకి తీసుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దాడి చేసింది త‌న అభిమానులేన‌ని సీఎం జ‌గ‌న్‌రెడ్డినే స్వ‌యంగా ఒప్పుకున్నారు. అందుకే, ఈ కేసులో జ‌గ‌న్‌రెడ్డి పేరు కూడా చేర్చాలంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు. దాడి ఘ‌ట‌న‌లో 70 మందిపై కేసు న‌మోదు చేసి చేతులెత్తేశారు. పైగా బాధితులైన టీడీపీ వ‌ర్గీయుల‌పైనా కేసులు క‌ట్టి.. అరెస్ట్ చేసి.. నాదెండ్ల బ్ర‌హ్మంను జైలుకు కూడా త‌ర‌లించ‌డం మ‌రింత దారుణ‌మైన విష‌యం అంటున్నారు. 

మ‌రి, క‌ర్ర‌లు, రాడ్లు, సుత్తిల‌తో దాడి చేసిన వైసీపీ గూండాల‌ను ఇంకా ఎందుకు ప‌ట్టుకోలేక పోతున్నారు? సీసీకెమెరాల్లో ప‌క్కాగా విజువ‌ల్స్ ఉన్నా.. ధ్వంస ర‌చ‌న మొత్తం రికార్డైనా.. ఆ ఫూటేజీ ఆధారంగా నిందితుల‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌ట్లేదు? వ‌చ్చిన వారంతా దేవినేని అవినాశ్ మిత్ర‌బృందంకు చెందిన వార‌ని విజ‌య‌వాడ‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వారంతా గంజాయి బ్యాచ్ అని చెబుతున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన అల్ల‌రిమూక‌ను బెజ‌వాడ వాసులు గుర్తు ప‌డుతున్నారు. మ‌రి, పోలీసులు మాత్రం వారిని గుర్తించ‌క‌పోవ‌డం.. అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. పోలీసులు పాల‌క ప‌క్షానికి కొమ్ము కాస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుతోంది. టీడీపీ నేత‌లు ప‌ట్టాభి, నాదెండ్ల బ్ర‌హ్మంల అరెస్టు విష‌యంలూ చూపించిన దూకుడు.. టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసిన వైసీపీ గూండాలు, గంజాయి బ్యాచ్‌ల‌పై చూపించ‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి, ఈ ఆరోప‌ణ‌ల‌కు పోలీసుల స‌మాధానం ఏంటి? సీసీ కెమెరా ఫూటేజ్‌లో క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నా.. నిందితులంద‌రినీ అరెస్ట్ చేయ‌క‌పోవ‌డాన్ని ఎలా చూడాలి?