Read more!

కేజ్రీవాల్... ఇంత దుర్మార్గుడివా...



మొన్నటి ఢిల్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ, ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కినప్పటికీ ఆయన మీద దేశ రాజకీయ వర్గాల్లో సదభిప్రాయం లేదు. ఢిల్లీ ప్రజలు ఆయన్ని గుడ్డిగా నమ్మేశారనే ఇప్పటికీ చాలామంది భావిస్తున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మూణ్ణాళ్ళ ముచ్చటగా ఆ పదవిలో వుండి, చేతులారా రాజీనామా చేసి, రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాడు. ఆ సమయంలో అందరూ ఇక కేజ్రీవాల్ పని అయిపోయినట్టే అని భావించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తామని హామీల మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పటి వరకూ ఒరగబెట్టింది శూన్యం. పార్టీలో అంతర్గత విభేదాలు, పగలు, ప్రతీకారాలతోనే కాలం గడిచిపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేధావుల కూటమి అని జనం భావించడం వల్లే జనం అధికారం ఇచ్చారని, కేజ్రీవాల్ ముఖం చూసి ఓట్లు వేయలేదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి. అయితే ఇప్పుడు ఆ మేధావులు అనుకున్నవారే ఆధిపత్యం కోసం, అధికారం కోసం తిట్టుకుంటూ రోడ్డుమీదకు ఎక్కుతున్నారు. ఢిల్లీ ప్రజలు పశ్చాత్తాపపడేలా చేస్తున్నారు.

ఇదంతా ఇలా వుంటే, అరవింద్ కేజ్రీవాల్ దుర్బుద్ధి, దుర్మార్గపు బుద్ధి ఇటీవల బయటపడింది. ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ కేజ్రీవాల్ మీద చేసిన ఆరోపణలు దేశ రాజకీయ రంగం మొత్తం నివ్వెరపోయేలా చేశాయి. అసలు అరవింద్ కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చింది సమాజసేవకుడు అన్నా హజారే కారణంగానే. అలాంటి అన్నా హజారే చనిపోవాలని కేజ్రీవాల్ కోరుకున్నాడంటే నమ్మగలమా? కానీ నమ్మక తప్పదు.. ఎందుకంటే ఈ ఆరోపణ చేసింది ఏ రాజకీయ ప్రత్యర్థో కాదు... ఏ పార్టీకీ చెందని స్వామి అగ్నివేష్. లోక్‌పాల్ బిల్లుకు అనుకూలంగా అన్నా హజారే నిరాహారదీక్ష చేసిన సమయంలో ఆయన చనిపోతే బావుండని కేజ్రీవాల్ భావించారట. ఆయన నిరాహారదీక్ష చేస్తూ చనిపోతే ఆ సందర్భంగా వచ్చే సానుభూతి పవనాలను తనకు అనుకూలంగా మలచుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారట. అందుకే అన్నాహజారే ఆరోగ్య పరిస్థితి విషమించినప్పటికీ, ఆయన దీక్షను మరో పదిహేను రోజుల పాటు పొడిగించేలా చేయడానికి ప్రయత్నించాడట. హమ్మ కేజ్రీవాలూ.. నువ్వు మరీ ఇంత దుర్మార్గుడివా..?