Read more!

ఏపీలో మరో టీడీపీ నేత అరెస్ట్... బాధితులకే శిక్ష..!

 

ఏపీలో వైసిపి ప్రభుత్వం టీడీపీ నేతలను కనీస ప్రొసీజర్ ఫాలో కాకుండా.. అడ్డగోలుగా అరెస్ట్ చేస్తున్న సంగతి తెల్సిందే. మొన్న చింతమనేని ప్రభాకర్.. నిన్న కొల్లు రవీంద్ర లను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా . వారిని అరెస్ట్ చేసే సందర్భంలో పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ వారికీ బెయిల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఇవాళ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ని వరుసకు బావ అయిన సత్తిరాజు రెడ్డి ని హత్య చేశారనే నేరం మోపి పోలీసులు అరెస్ట్ చేసి బిక్కవోలు పోలీసు స్టేషన్ కు తరలించారు.

రెండు నెలల క్రితం సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో సత్తిరాజు రెడ్డి రెండో భార్య.. ఈ మృతి ఘటనలో రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ కేసు విచారణలో ఏం తేలిందో చెప్పకుండానే పోలీసులు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసారు .దీంతో కేవలం రాజకీయ కారణాలతోనే ఆయనను అరెస్టు చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఇది ఇలా ఉండగా కొన్నిరోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మధ్య అవినీతి వ్యవహారాలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఆలయంలో ప్రమాణానికి సవాల్ చేయగా . రెండు వర్గాలు కూడా ఆలయంలో ప్రమాణం చేశాయి. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి బావ హత్య అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలను వేధింపులకు గురి చేయడం కోసం.. ఎవరితో ఒకరితో పిర్యాదు ఇప్పించడం.. తరువాత కనీసం దర్యాప్తు కూడా లేకుండా అరెస్టు చేయడం మామూలై పోయిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

తాజాగా ఇదే అంశంపై నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. "రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి సంఘటన చక్కటి ఉదాహరణ. సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది. కోర్టులో ఎన్నిసార్లు చివాట్లు తిన్నా కొంతమంది పోలీసులు వైకాపా నాయకులకు వంతపాడుతూనే ఉన్నారు. చేస్తున్న ప్రతి తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదు. తక్షణమే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలి" అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ తోపాటు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న వీడియోను లోకేష్ షేర్ చేశారు.