Read more!

ఇదేమి రాజ్యం? రాజారెడ్డి రాజ్యం.. ఫ్యాక్షన్ రాజ్యం.. రౌడీ రాజ్యం?

ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన పీక్స్ కు వెళ్లింది. రాజారెడ్డి రాజ్యమంటే ఎట్టా ఉంటాదో రుచి చూపించారని, కడప ఫ్యాక్షన్ మంగళగిరిలో అమలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.  జస్ట్ నాటు బాంబులు మాత్రమే వేయలేదు.. మిగతా అంతా సేమ్ టూ సేమ్. కర్రలు, రాడ్లు, సుత్తిలతో టీడీపీ ఆఫీసులపై దాడులకు తెగబడ్డారు. రాళ్లతో విధ్వంసం స్రుష్టించారు. వందలాది మంది మూకగా వచ్చి.. పక్కా ప్లాన్డ్ గా అరాచకానికి పాల్పడ్డారు. ఏకంగా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంపైనే అటాక్ చేయడమంటే మాటలా? పక్కనే డీజీపీ ఆఫీసు ఉన్నా.. ఇంకోవైపు ఏపీఎస్పీ బెటాలియన్ ఉన్నా.. వందలాది మంది ఇలా మూకదాడులకు దిగారంటే.. ఇది ఆంధ్రప్రదేశా? అఫ్ఘనిస్తానా?

మాట్లాడితే కొట్టేస్తారా? ప్రశ్నిస్తే చంపేస్తారా? ప్రెస్ మీట్లు పెడితే విధ్వంసానికి దిగుతారా? ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక, రాజారెడ్డి రాజ్యాంగమా? అన్న అనుమానాలు వస్తున్నాయి. జగన్ సీఎం అయినప్పుడే అంతా భయపడ్డారని, భయపడినట్టే జరిగిందని అంటున్నారు. కడప ఫ్యాక్షన్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏకకాలంలో మంగళగిరి, విశాఖ, తిరుపతి, నెల్లూరు, హిందూపురం, కర్నూలు వంటిచోట్ల వైసీపీ దాడులకు తెగబడిందంటే ఏమనాలి? వారిని ఏం చేయాలి? ఇది పక్కా ప్లాన్డ్ కాకపోతే ఇంకేంటి? ఇవి తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో జరిగిన దాడులు కాక ఇంకేంటి?

వైసీపీలో ఫ్రస్టేషన్ ఫీక్స్ కు చేరింది. అన్నివైపులా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో తట్టుకోలేకపోతోంది. అప్పులు ముట్టడం లేదు.. కరెంట్ కోతలు ఆగడం లేదు.. ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు.. నిరుద్యోగులు తిరగబడుతున్నారు.. సంక్షేమ పథకాలకు భారీ కోత పడుతున్నాయి.. నవరత్నాలు ఒక్కోటిగా రాలిపోతున్నాయి.. ఇలా లెక్కలేనన్ని సమస్యలతో సతమతమవుతున్న వైసీపీ సర్కారుపై డ్రగ్స్ దందా పిడుగుపాటులా పడింది. వైసీపీ నాయకుల కనుసన్నల్లో డ్రగ్స్ యవ్వారం సాగుతోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నిత్యం ప్రభుత్వాన్ని తూట్లు పొడుస్తూనే ఉన్నారు. అదంతా నిజమే కావడంతో.. సమాధానం చెప్పుకోలేక వైసీపీలో ఫ్రస్టేషన్ పెరిగిపోయి.. ఇలా దాడులకు దిగుతున్నారని అంటున్నారు.

ఇటీవల కాకినాడ టీడీపీ కార్యాలయంపై ఇలానే దాడికి తెగబడింది వైసీపీ. పట్టాభిపై దాడికి ప్రయత్నించింది. అప్పుడే వారిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే.. పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చుండేది కాదు. వైసీపీ బెదిరింపులకు భయపడకుండా పట్టాభి తన దూకుడును కంటిన్యూ చేయడంతో.. అధికార పార్టీ దొంగలు తట్టుకోలేకపోయారు. విజయవాడలోని పట్టాభి ఇంటిపై పడి విధ్వంసం స్రుష్టించారు. ఆ దాడికి కొనసాగింపుగా.. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై పడి ఫ్యాక్షన్ తరహా దాడి చేశారు. పావు గంట పాటు కిష్కిందకాండను తలపించారు. ఫుల్లుగా తాగేసి.. ఆయుధాలు చేతపట్టి.. రచ్చ రచ్చ చేశారు. వైసీపీ రౌడీల దాడిలో పలువురు టీడీపీ సిబ్బంది తీవ్రంగా గాయపడగా.. వారి ప్రాణాలకు ఏమైనా అయితే అందుకు జగన్ బాధ్యత వహిస్తారా? పట్టాభి మాటలకే దాడికి దిగితే.. ఇక మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ లు నిత్యం బూతులు మాట్లాడుతున్నందుకు తాడేపల్లి ప్యాలెస్ పై ఇంకెలాంటి దాడులు చేయాలో వైసీపీ వాళ్లే చెప్పాలి? తాడేపల్లి ప్యాలెస్ ను తగలబెట్టాలా? లేక, కడప బాంబులతో పేల్చేయాలా? వైసీపీ నాయకులే చెప్పాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

తమది ప్రజాస్వామ్య పార్టీ కాదని.. ఫ్యాక్షన్ పార్టీ అని.. వైసీపీ పదే పదే నిరూపించుకుంటోంది. ఇటీవల, ఏకంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైనే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ రౌడీలను వేసుకొని దాడికి వచ్చారంటే అంతకన్నా అరాచకం ఇంకే ముంటుంది. జోగి రమేశ్ పై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. అదే టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేస్తే మాత్రం.. పోలీసులు ఇంటికొచ్చి మరీ నోటీసులు ఇస్తారు. వైసీపీ మూకలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులను విధ్వంసం చేస్తారు. అందుకే అంటున్నారు.. ఇదేమి రాజ్యమని? రాజారెడ్డి రాజ్యం.. ఫ్యాక్షన్ రాజ్యం.. రౌడీ రాజ్యం.. గూండా రాజ్యమని. చంద్రబాబు డిమాండ్ చేసినట్టు.. వెంటనే ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.