Read more!

టిబితో ప్రమాదమే...

మానవ జీవితానికి ఎంత చరిత్ర ఉందొ మనుషుల్ని పట్టి పీడించే క్షయ వ్యాధికి అంటే టి.బి కి కూడా చరిత్ర ఉంది 
క్షయకు సంబందించిన ప్రస్తావన మన వేదాలలోను వుంది.క్రీస్తు పూర్వం 6౦౦ నటి కలం లోనే చరక సంహిత సుశ్రుత గ్రంధంలో ఉందని వుంది.తేలికగా కనిపెట్ట గలిగి పూర్తిగా నయం చేయగలిగే క్షయ వ్యాధికి సగటున నిమిషానికి ఒక భారాతీయుడు చనిపోతున్నా డంటే మన వాళ్ళు ఈ వ్యాధి పట్ల ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్సిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ట్యూబక్లోసిస్ గా పిలవ బడే క్షయ వ్యాధికి సంబందించిన క్రిమి ని 1882 లో రాబర్ట్ కాక్ అనే జర్మన్ డాక్టర్ కనిపెట్టడని ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీదే ఈ వ్యాధిని కోచ్స్ డి సిజెస్ గా పిలుస్తారు.ఆయన కనిపెట్టిన క్షయ వ్యాధి కరక క్రిమి పేరు మై కో బాక్టీరియమ్ టుబేర్ క్లోసిస్ దూర దృష్ట వసాత్తూ ఈ వ్యాధికి ట్రీట్ మెంట్ ఆ తరువాత మరో అరవై ఏళ్ల దాకా కనిపెత్తబడలేదు.ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 8 మిలియన్ల కొత్త టి బి కేసులు నమోదు అవుతున్నాయి. వాటిలో 1. 5మిలియన్ల కేసులు మన దేశానికీ సంబందించినవే సగటున నిమిషానికి ఒక భారతీయుడు టిబి మూలంగా చనిపోతున్నారాణి తెలుస్తోంది.

టిబి ఎలా మొదలౌతుంది?...

టిబి శరీరం లోని ఏ భాగానికైనా సోకవచ్చు ఎక్కువగా ఊపిరి తిత్తులకు సోకు తోంది.సాధారణంగా టిబి క్రిములున్న గాలిని పీల్చడం వల్ల ఇవతలి వ్యక్తి టిబి సోకుతుంది. టి బి సికిన మనిషి దగ్గి నప్పుడు,ఉమ్మి వేసినప్పుడు,మాట్లాడు తున్నప్పుడు లేదా చీదు తున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి క్రిములు
గాలిలోకి వ్యాపిస్తాయి ఆ గాలిని పీల్చిన ఎదుటి మనిషి లోకి క్రిములు ప్రవేసిస్తాయి. ఒక మనిషి శరీరంలోకి టి బి క్రిములు ప్రవేశించగానే ఆ క్రిముల్ల్ని వసపరుచుకోడానికి అతడి శరీర కఫాన్ని తయారు చేస్తుంది. క్రిముల్ని ఇముడ్చుకున్న ఆ మ్యుకస్ ను ఆ వ్యక్తి దగ్గడం లేదా ఉమ్మడం ద్వారా లేదా చీదడం ద్వారా బయటికి నేట్టివేస్తాడు. శరీరంలో టి బి క్రిములు ఇంకా ఎమన్నా మిగిలి ఉంటె వాటిని అతడిలోని రక్త కణాలు చంపడానికి ప్రయత్నిస్తాయి.  రెండు రకాలుగానూ అతడి శరీరం టి బి క్రిములను వదిలించుకోలేక అవి ఆశరీరంలో తిష్ట వేసి కుని ఆవ్యక్తి శ్వాస నాళాల ద్వారా వరూధి చెందు తాయి. సరైన పోషకాహారాన్ని తీసుకోక పోవడం డయాబెటిస్,ఎయిడ్స్,కోరింత దగ్గు ,తట్టు,కిక్కిరిసిన ప్రదేశాలలో నివాసముండడం, సరైన పరిశుభ్రత పాటించక పోవడం.ఇలాంటి వన్నీ టి బి ఇన్ఫెక్షన్ అభ్వృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి.

టి బి లక్షణాలు....

1)టి బి లక్షణాలు  ఏ అవయవానికి సోకిందన్న దాని మీద శరీరంలో ఒక్క ఊపిరి త్తులకే కాదు ఏ అవయవంకైనా టిబి సోకవచ్చు. లింఫ్ గ్రంధులు, ఎముకలు, కీళ్ళు, చర్మం, ప్రేవులు, మెదడు, కిడ్నీలు ఇలా ఏ అవయవామైనా సోకవచ్చు అని అంటున్నారు నిపుణులు. సాధారణంగా మన శరీరంలోని రోగ నిరోధక యంత్రాంగం టిబి క్రిమి మనకు సోకకుండా అంటే  ఇన్న్ఫెక్ట్ కాకుండా కాపాడుతుంది. అయితే కొందరిలో ఈ యంత్రాం గం బలహీనంగా ఉండడం వల్ల ఆవ్యక్తులు టి బి బారిన పడుతూ ఉంటారు.

ఊపిరి తిత్తులలో టిబి....

మనిషికి టిబి ఎక్కువగా ఊపిరి తిత్తులకే సోకుతూ ఉంటుంది.దీని ముఖ్య లక్షణం దగ్గు.టిబి మూలంగా వచ్చే సాధారణ దగ్గు సాధారణ మందులకు సిరప్ లకు లొంగదు.ఏ వ్యక్తి అయినా రెండు వారాలకు పై బడి దగ్గుతూ ఉంటె ఈ రెండు వారాలలో ఏ మందు వాడినా ఉపయోగం లేకపోతే ఆవ్యక్తి టి బి సోకిందేమో అని సందేహించ వచ్చు. ఈ వ్యాధిలో దగ్గు తో పాటు జ్వరం కూడా ఉంటుంది.సాధారణంగా ఈ జ్వరం ఉదయం వచ్చి సాయంత్రానికి తగ్గిపోతుంది.వారం లోగా రోగి బాగా బలహీనం అయిపోతాడు.
ఇన్ఫెక్షన్ కొంత్రోల్ చేయడానికి శరీరం తన శక్తి నంతా కూడా దీసుకుని ప్రయత్నం చేయడం వల్ల త్వరగా బరువు కోల్పోతాడు.ఆకలి వేయక పోవడం లేదా సరిగ్గా అన్నం తినలేక పోవడం మరో సమస్య.
ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం మొదలైన కొద్దీ దగ్గి దగ్గి ఉమ్మేసి నప్పుడు కళ్ళే తో పాటు రక్తం పడుతుంది. చాతిలో నెప్పి వాళ్ళ ఇబ్బంది కలగ వచ్చు. ఈ లక్షణా లన్ని కలగలిపి మొత్తం మీద తాను అనారోగ్యం తో బాధ ఒఅదుథున్నాడని అనిపించవచ్చు ఏ పని చేయలేకపోవడం లేదా మనుషులకు దూరంగా ఎప్పుడూ పడుకోవాలని అనిపించడం గమనించవచ్చు.

లింఫ్ గ్రంధులకు టిబి...

మన శరీరం మొత్తం మీద అనేక లింఫ్ గ్రంధులు వుంటాయి.శరీరంలో ఏ భాగమైనా ఇన్ఫెక్షన్ కు గురి అయినప్పుడు.సూక్ష్మ క్రిముల పైన దాడి చేయడం కోసం ఈ గ్రంధులు రక్షక కణాలను ఉత్పత్తి చేస్తాయి.ఆ భాగానికి పంపిస్తాయి.రోగ నిరోధక శక్తి యంత్రాంగం బలహీనంగా ఉన్నప్పుడు ఆభాగాన టిబి చోటు చేసుకోవచ్చు.అప్పుడు లింఫ్ గ్రంధులు వస్తాయి.సాధారణంగా టిబి మొదట మెడ వద్ద గ్రంధికి సోకుతుంది.

వెన్నెముక టిబి...

వెన్నెముకకు టి బి సోకడం చాలాఅరుదుగా  జరుగుతూ ఉంటుందిఈ స్థితిలో వెన్నెముక పెళుసుగా స్తిఫ్ఫ్ గా ఉంటుంది నొప్పి కలుగుతూ ఉండడమే కాదు గూని కూడా వచ్చే అవకాసం ఉంది. టిబి వచ్చిన వెన్నె ముక భాగానికి దగ్గరలో చీము గడ్డ లాంటిది ఏర్పడుతుంది.దీనిని కోల్డ్ అబ్స్సుస్స్ అంటారని వైద్యులు పేర్కొన్నారు. మిగతా చీము గడ్డల్లా ఈ చీముగడ్డ మూలంగా నొప్పి అంటూ ఏమి ఉండదు.నయం చేసుకోకుండా ముద్ర పెడితే  పక్షవాతమూ వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

బోన్ టిబి...

ఎముకలకు, కీళ్ళకు సోకే టిబి లో తుంటి వద్ద కీలు,మోకాలి కీలు,చీలమండలు,పాదం,ఎముక,భుజం కీలు,మోచేతి కీలు, మణి కట్టు,చేతి ఎముకలకు టి బి సోకే అవకాసం ఉంది. ఎముకకలకు,కీళ్ళకు టిబి సోకిన వ్యక్తి కీళ్లలో నొప్పివస్తుంది.ఆయా అవయవాలు కదలికలు ఇబ్బందిగా ఉంటాయి. కుంటడం, లేదా అంగ వైకల్యమూ సంభవించవచ్చు. టిబి సోకిన ఎముకకు దగ్గరలో వుండే కండరాలు బలహీన పడి లేదా చిక్కి సల్యమై రాత్రులు ఆయా భాగాలలో వచ్చే నొప్పికి చిన్న పిల్ల లైతే నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు.ఈ విషయాన్ని తల్లి తండ్రులు గమనించాలి.

కిడ్నీకి టి బి...

కిడ్నీ కి టి బి వస్తే చాలా తొందరగా కిడ్నీ చెడిపోతుంది.టిబి వచ్చిన రోగుల్లో మూత్రానికి మాటిమాటికీ వెళ్ళాల్సి రావడం.మూత్ర విసర్జన చాలా బాధాకరంగా ఉంటుంది.మూత్రం తో పాటు రక్తం కూడా పడవచ్చు.తరువాత వెన్ను నొప్పి ప్రారంభ మౌతుంది.తరువాత తరువాత జనేన్ద్రియలకు పాకే అవకాసం ఉంది. స్త్రీలలో కిడ్నీలకు టి బి సోకితే వాళ్ళు గొడ్రాలుగా మారే అవకాసం ఉంది.మన దేశంలో స్త్రీలు గోడ్రాలుగా మారడానికి కారణం కిడ్ని కి టి బి యే కారణమని నిపుణులు తేల్చారు.

పొత్తికడుపు లో టి బి...

పొత్తి కడుపుకు టి బి సోకితే నీళ్ళ విరేచనాలు,ఆకలి కోల్పోవడం,తీవ్రమైన జ్వరం,పొత్తి కడుపు ఉబ్బడంమొదలైన లక్షణాలు ఉంటాయి.

గుండెకుటి బి...

వాస్తవానికి గుండె చుట్టూ ఉండే సంచి లా ఉండే భాగం పెరి కోర్దియం అంటారు దీనికి టి బి సోకిందో గుండెకు టిబి సోకి నట్లే. గుండె దగ్గరగా ఉండే చాత్తి భాగాన నొప్పి ఉంటుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది.ఉచ్వాస నిశ్వాసాలు వేగా వంతంగా ఉంటాయి.

కన్ను చేవ్వి,ముక్కు గొంతుకు టిబి...

కంటికి,చెవికి,ముక్కుకి,గొంతుకి టి బి సకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కంటికి టి బి వ్వాస్తే దృష్టి కోల్పోవచ్చు,ఇంకా నయం చేయడానికి వీలు కాని విధంగా ఉంటె కన్ను తొలగించాల్సి వస్తుంది. అలాగే శ్వాస నాళానికి కూడా టిబి సోకే అవకాసం ఉంది,అదృష్ట వశాత్తు ఆయా శరీర భాగాలలో డిఫెన్స్ యంత్రాంగం  పటిష్టంగా ఉండడం వల్ల టి బి చాలా అరుదుగా వచ్చే అవకాసం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

మెడకు టిబి...

మెడకు టి బి వస్తే దీనిని టి బి మేనేన్జటిస్ అంటారు మెదడు లోని కణాలకు టి బి సోకి నప్పుడు ఆభాగాన టుబర్ క్లోమా ఏర్పడుతుంది మెదడు పోరాభాగాలకు టి బి సోకితే అది మేనిన్జిటిస్ కు దారు తీస్తుంది.ఇది ఎక్కువగా చిన్నపిల్లలో వస్తుంది.

దీనిని బట్టి మనకు శరీరంలో ఏ భాగంలో ఐనా టి బి వస్తుంది.అది ఆయా వ్యక్తి శరీరం మొత్తం మీఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది.ఒక్కసారి వ్య్సక్తిలోని రోగ నిరోధక శక్తి బలహీనా పడిందంటే ఒకదాని వెంట మరో అనారోగ్యం దాడి చేస్తూనే ఉంటుంది.సకాలంలో వ్యాధిని గుర్తించి నయం చేసుకోక పోతే ప్రమాదమే.