Read more!

ప్రాణాలు పోతున్నా పట్టని పాలకులు.. టీఎస్ పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ 

ప్రజల ప్రాణాలు పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కాళ్లు మొక్కి ప్రాధేయపడుతున్నా తెలంగాణ పోలీసులు కనికరించడం లేదు. సరిహద్దుల్లో తెలంగాణ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేయడం చేస్తున్నారు. కొవిడ్ రోగులతో వస్తున్న అంబులెన్సులు, ఇతర వాహనాలను అడ్డుకుంటున్నారు. దీంతో తెలంగాఁ సరిహద్దుల్లో పదుల సంఖ్యలో అంబులెన్సులు నిచిలిపోయాయి. అంబులెన్స్ నిలిపివేతతో పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఒకరు మృతి చెందారు. గత రాత్రి 12 గంటల నుంచి పోలీసులు అంబులెన్స్‌లను తెలంగాణలోకి రాకుండా నిలిపివేశారు. సుమారు వంద అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. బాధితులు ఎంత బ్రతిమలాడినా పోలీసులు, వైద్యశాఖ అధికారులు ఒక్క అంబులెన్స్‌ను కూడా అనుమతించలేదు. దీంతో శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటలకు ఓ అంబులెన్స్‌లో ఉండే పేషెంట్ మృతి చెందాడు. రోగి మృతిచెందిన వెంటనే అంబులెన్స్ తిరిగి వెళ్లిపోయినట్లు తెలియవచ్చింది. ఆస్పత్రి అనుమతి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక అనుమతి ఉంటేనే తప్ప పోలీసులు పుల్లూరు టోల్ గేట్ నుంచి అనుమతించడంలేదు. 

తెలంగాణ సర్కార్, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చికిత్స కోసం వస్తున్న రోగుల పట్ల కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం వస్తుంటే అడ్డుకోవడం దారుణమంటున్నారు ఏపీ రోగులు. తెలంగాణ సర్కార్ తీరుపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఏపీ జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులకు పట్టదా అని నిలదీస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణ పోలీసుల తీరుతో ఇప్పటికే కొందరు చనిపోయారని, పరిస్థితి విషమించక ముందే అంబులెన్సులను అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఆర్ఎస్ గరిమళ్ల వెంకటకృష్ణరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నాలుగు రోజుల క్రితం కూడా సరిహద్దులో అంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌పై స్పందించి పోలీసులపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లను ఆపితే కోర్టు ధిక్కరణ కిందకు తీసుకోవాల్సి వస్తుందని.. అప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. ఇంటర్ స్టేట్ బార్డర్స్ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను ఎందుకు అవుతున్నారని కేసీఆర్‌ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్టాల నుంచి అంబులెన్స్‌లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని... వారిని ఆపమని మీకు ఎవరు చెప్పారంటూ హైకోర్టు ఫైర్ అయింది. అంబులెన్స్‌లను ఆపడం మానవత్వమేనా? అంటూ హైకోర్టు అక్షింతలు వేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. అయినా  వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.