Read more!

 దడ పుట్టిస్తున్న ఓమైక్రాన్...    

భారత్ లో పెరుగుతున్న  ఓమైక్రాన్  బాధితుల సంఖ్య ? 

భారత్ లో ఓమైక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం మొత్తం 6,822  కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది . వివరాలు ఆయారాష్ట్రాలలో ఈ క్రింది విధంగా ఉన్నాయి.
                                             

 

రాష్ట్రాలు

 ఓమైక్రాన్  బాధితుల సంఖ్య

కేరళా

                 3,277 

తమిళ నాడు.               

719

మహారాష్ట్ర 

518

వెస్ట్ బెంగాల్

465

మిజోరం

330

 

మరణాలు

  220

అయారాష్ట్రాలలో  చేపట్టిన చర్యల వివరాలు  ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

ఉత్తరప్రదేశ్....

ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ ఆదేశాల మేరకు విదేశాల నుండి వస్తున్న వారికి ఇతరులకు ఆర్ టి పి సి ఆర్  పరీక్షలకు అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యింది.  అసుపాత్రుల లో మెరుగైన సేవలకు త్వరిత గతిన సౌకర్యాల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.

 తమిళ నాడు....

ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వం లోని ప్రభుత్వానికి  ఓమైక్రాన్ నుండి ప్రజలను రక్షించు కోవడం పెద్ద సవాల్ గా మారింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు  తప్పనిసరిగా ఆర్ టి పి  సి ఆర్ పరీక్షలు  ఓ మైక్రాన్  బాధితులకు  ఇసోలేషణ్ చికిత్స. ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల పెంపు.  ఇప్పటికే  5,858  పరీక్షలు నిర్వహించగా, 5,249  హై రిస్క్  కేసులు  గుర్తించారు. 

డిల్లి రాష్ట్రం....

డిల్లి కేజ్రీవాల్ నేతృత్వం లోని ఆప్ సర్కార్ గతం లో కోవిడ్ ప్రభావాన్ని చూసిన అనుభవం ప్రస్తుతం డిల్లి లోని పరిస్థితులను మంత్రి జైన్ సమీక్షించారు. గ్రేడేడ్ రెస్పాన్స్  యాక్షన్ ప్లాన్ సహకారం తో  టెస్టింగ్,ట్రేసింగ్, ఇసోలేషణ్ విధానాని అమలు చేసేందుకు సన్నధం అవుతోంది. ప్రస్తుతం విదేశాల నుండి వచ్చే  ప్రయాణీకులతో డిల్లి విమానాశ్రయం కిటకిట లాడుతోంది కాగా ఆర్ టి పి సి ఆర్  పరీక్షల కోసం  ఘంటల తరబడి వేచిచూడాల్సి రావడం తో అటు అంతార్జాతీయ ప్రయాణీకులు డొమెస్టిక్ ప్రయాణీకులు  తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. కాగా రెండవ విడత ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆప్ సర్కార్ మెరుగైన  చికిత్సకు సన్నద్దం అవుతున్నట్లు  తెలుస్తోంది .

ప్రస్తుతం ఓమైక్రాన్ శాస్త్రీయత ....

ఓమైక్రాన్ పై వస్తున్న కొన్ని సందేహాలకు సమాధానం దొరకడం లేదు. ఓమైక్రాన్  ప్రభావం స్వల్పంగా ఉంటుందా.లేక తీవ్రంగా ఉంటుందా,ఎలాంటి ప్రబావం ఉంటుంది,వ్యాదితీవ్రత ప్రభావం అనారోగ్యం ఉంటుంది అన్న సందేహాలకు పూర్తిగా సమాధానం లభించడం లేదు. గతంలో కోవిడ్ తీవ్రత ఇమ్యునిటీ పై ప్రభావం, వేరియంట్ తీవ్రత ప్రభావం వ్యాక్సినేషన్ ఒమైక్రాన్ ను నిలువ రించాగాలదా?సొత్ ఆఫ్రిక పరిశోదనలో ఓమైక్రాన్  వ్యాప్తి ఎక్కువే,లక్షణాలు స్వల్పమే,అయినా  తక్కువస్థాయిలో వైద్యం  అవసరం? ఎలాంటి చికిత్స ఇస్తున్నారు? ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో  వారిలోనే వైరస్ వచ్చిచేరుతోందా ? వైరస్ ఎలా వ్యాపిస్తుంది.?  వైరస్ వచ్చిన యువతీ యువకులలో  ఇన్ఫెక్షన్ శాతం ఎంత? చాలా ఆసుపత్రులలో  స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి.

సౌత్ ఆఫ్రికాలో  ఒమైక్రాన్  ఎలా ప్రవర్తిస్తోంది?

అలాగే ఇతర దేశాలలో  ప్రవర్తిస్తోంధా? ఒక్కోచోట జీనోమిక్స్ సీక్వెన్స్ ఎలాఉంది? జీనోమిక్ సీక్వెన్స్ లో ఎలాంటి తేడాలు ఉంటున్నాయి.? వ్యాక్సిన్ ఓమైక్రాన్  ను నియంత్రించ గలదా?అన్నసందేహాలు అటు సామాన్యుడితో పాటు ఇటు వైద్యులను వేదిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఇపాటికే వ్యాక్సిన్ కంపెనీలతో  సంప్రదింపులు జరుపు తోంది. వ్యాక్సిన్లు  తీవ్రతను తగ్గిస్తాయా? మరణాలను నిరోదిస్తాయా? ప్రస్తుతం ఒమైక్రాన్ విస్తరిస్తోంది. అన్న అంశం పై పరిశోదనలు జరుగుతున్నాయి. ఓమైక్రాన్  ఇన్ఫెక్షన్ స్తాయి. వ్యాక్సిన్ పనితీరు, ఓమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు, ఓమైక్రాన్ కు చికిత్స ప్రభావం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వీటిపై సమాగ్రసమాచారాం అందించే బాధ్యత ఆయాదేశాలాడే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ  పేర్కొంది.