Read more!

ఓమి కార్నో కొత్తవేరియంట్ కలకలంతో కేంద్రం అప్రమత్తం .

కోరోనా మూడవ వేవ్ వస్తుందా రాదా అన్న సందేహాలు అనుమానాలు వ్యక్జ్తం చేస్తూ నిపుణులు చేసిన విశ్లేషణలు పటాపంచలు చేస్తూ సౌత్ ఆఫ్రికాలో కోరోనా కొత్తవరియట్ ను గుర్తించినట్లు ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ హెల్త్ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యు హెచ్ ఓ కోరోనా కొత్తవేరియంట్ ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించినట్లు తెలిపారు. కొత్తవేరియంట్ కు బి.1 .1 52 9 ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు.  దీనికి ఒమిక్రాన్  గా  నామ కారణం చేసారు. ఇది చాలా వేగంగా పరివర్తన చెందుతోందని. ఈ వేరియంట్ అత్యంత  ప్రమాదకరమని వేరియంట్ అనూహ్యంగా పరివర్తన చెందడం ఆ, త్వరిత గతిన విస్తరిస్తోందని   ఆందోళన కలిగించే అంశంగాప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఈమేరకు అత్యవసర సమావేశం నిర్వహించిన డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. డెల్టా వరియంట్ ప్రపంచం మొత్తం విస్తరించిందని కొత్తవేరియంట్ బి.1.1 .529 గా శాస్త్రజ్ఞులు గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మార్ తెలిపారు.

కాగా చర్చల అనంతరం వేరియంట్ పై మరిన్ని పరిశోదనలు చేయాలనీ అన్నారు. ప్రపంచ దేశాలలో ఇప్పుడిప్పుడే విదేశి ప్రయాణీకులకు సడలింపులు ఇస్తున్న వేళ కొత్తవేరియంట్ తో సోతాఫ్రికా లేదా ఇతరా దేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల పట్ల అప్రమత్తం గా ఉండాలని ముఖ్యంగా బ్రెజిల్,బంగ్లాదేశ్,బోత్స్ వానా,చైనా,మారిషస్,న్యూజీలాండ్,జింబాబ్వే,సింగపూర్,ఇజ్రాయిల్, హాంగ్ కాంగ్,యూరప్ దేశాలు ముఖ్యంగా యు కే దేశాల నుండి వచ్చే ప్రయానీకులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలని కేంద్రం సన్నద్ధం అయ్యింది.

భారత్ లో కొత్త వేరియంట్ తో కొత్త కరోనా కేసులు పెరిగాయి..భద్రం

భారత్ లో కొత్తవేరియంట్ ప్రభావం ఉందా?

భారాత్లో రోజురోజుకి కోరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ క్రమం లో బెంగళూరు కు చెందిన స్పూర్తి వైద్య కళా శాలలో 182 మంది విద్యార్ధులు,ఉద్యోగులకు కోరోనా పోజిటివ్ గా గుర్తించడం తో తీవ్రకలకలం కొనసాగుతోంది. వివరాల లోకి వెళితే బెంగళూరు లోని నర్సింగ్ విద్యార్ధులు పూర్తిగా వ్యజ్సిన్ వేసుకున్నప్పటికీ కోరోనా సోకడం తీవ్రా ఆందోళన కలిగిస్తోంది.నర్సింగ్ వుద్యార్ధులు బీస్ సి చదువుతున్నారని.అందులో ఒక్క విద్యార్ధి మాత్రం వ్యాక్సిన్ వేయిన్చుకోలేదని.ఆమెకు  జూన్ లో పోజిటివ్ వచ్చిందని. ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏమిటి  అంటే  ప్రతి 15 రోజులకు ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు కళా శాల యాజామాన్యం చెపుతున్నది  నిజమేనా అన్నది సందేహం కలిగిస్తుంది.కాగా కళాశాలలో అందరికీ వ్యాక్సిన్లువేయించిందని చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉంటె బెంగళూరు విద్యార్ధులకు   దాదాపు 182 మంది విద్యార్ధులకి పోజిటివ్  కావడం పై దీనికి గల  కారణాలు అసలు వారికి సోకిన వేరియంట్డెల్టా వేరియంట్,లేదా కొత్తవేరియంట్ లక్షణాలు ఉన్నాయా, కొత్త వేరియంట్ ప్రభావం ఎలాఉంది ఎలా సోకింది.

చికిత్స విధానం పై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని  కళా శాల యాజ మాన్యం పేర్కొంది. ఇదిలా ఉంటె హైదరాబాద్ లో కూడా కోవిడ్ మొదలు మొదలు అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే హైదరాబాదులోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్త్రోఎంట్రోలోజీలో చికిస్థ పొదుతున్నప్రముఖ నృత్యదర్శకుడు కూడా కోవిడ్ బారిన పడినట్లు ఆసుపత్రి వర్గాలు ద్రువికరించాయి. అలాగే ఖమ్మం జిల్లాలో కొందరు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తో౦ది. మొత్తం మీద తెలంగాణలోను కోవిడ్ కలకలం మొదలై౦ది అని అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ మేరకు ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఫై వైద్య అధికారులు సూచించారు.