Read more!

భావి భారతం ఎక్కడ ?

 

చిదిమితే పాలుగారే వయస్సు వాళ్ళది, కొడితే ఎర్రగా కం దిపోయే శరీరం వాళ్ళది. బంగారు వర్ణం లో ఉండే ఆచిన్నారుల్ని అక్కున చేర్చు కునే  వారు  ఉన్నారా? అంటే ఉన్నారు అయితే సహజంగా ఆవయస్సులో పెడతా మంటే ఆశ ,  కొడతా మంటే  భయం . అలా అమాయకంగా, ఉంటున్న జీవితంలో ఏదో తెలియని నిస్సతువ, ఏదో  తెలియని  నిరుత్సాహం.  అందరిలాంటి పిల్లలే వీళ్ళు ఎప్పుడూ ఒంటరి తనం కోరుకుంటారు, కొన్ని సదర్భాలలో  ఉద్రేకా నికి లోనూ అవుతూ ఉంటారు. చిన్న పాటి నిర్లక్ష్యం, క్షణికావేశం వాళ్ళని నేరస్తులను చేస్తుంది.

ఇవి సాదారణ అంశం కాదు భావితరం. ముందు ముందు దేశాన్ని నడిపించాల్సిన భావితరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఇవి. , అయితే పుడుతూనే దొంగలు కారు వీరు, ఖూనీ కొర్లు ఆగంతకులు కానే కారు వీళ్ళు, వారి వారి  సామాజిక ఆర్ధిక సమస్యలు వాళ్ళని ఈ పరి స్థితికి, తీసుకు వచ్చేందుకు  కారణమని కొందరు, కాదు కాదు  వాళ్ళు జీవిస్తున చుట్టు  పక్కల పరిస్థితులు వాళ్ళను నేరస్తులుగా నిరూపించా యని అంటున్నారు నిపుణులు. చిరు ప్రాయంలోనే బాల నేరస్తులుగా ఎందుకు మారుతున్నారు.

అందుకు కారణాలు,  అందరి జీవితల్లో నీకు యే జీవితం  ఇష్టం అని అడిగితే ఆడే పడే పసి వయస్సు పసి మొగ్గలాంటి చిన్నారులు అప్పుడే  మొగ్గ తొడిగిన ఆ చిరు  ప్రాయం లో అటు తల్లి తండ్రులు  ఇటు ఐన వాళ్ళను వదిలి బాల నేరస్తులుగా 3 నుంచి 7 ఏళ్ల జైలు జీవితాన్ని అనుభవస్తున్నారు ఆ చిన్నారులు.  అటువంటి చిన్నారుల జీవితం లో   కమ్ముకున్న అఛీ కట్లకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు చిన్నారులు చెప్పే సమాధానం ఏమిటి? అలాంటి బాల నేరస్తుల పట్ల ఎలా ప్రవర్తించాలి?

అన్న అంశాలను జువనైల్ జస్టిస్ చట్టం 2015  ఏం  చెపుతోంది అనే అంశాన్ని తెలుసుకుందాం.                                                                      
ప్రతి బాల బాలిక లోనూ శక్తి సామర్ధ్యలు ఉంటాయి. అందరూ శక్తి మంతులే, ఏదో సాధించాలి, తాను అందరిలా ఉన్నత స్థాయి లోకి ఎదగలన్న థ్హప త్రయం ఉంటుంది. భారత రాజ్యాంగం, బాల బాలికలకు అత్యంత ప్రాధాన్యత ను ఇచ్చింది అనడంలో ఏ మాత్రం  సందేహం లేదు  బాల బాలికల బధ్రత కోసం( జువానైల్ జూస్టిస్)చట్టం 2015 ప్రకారం బాల బాలికల సంరక్షణ, రక్షణ, వారి అభివృద్ధి, చికిత్స, సామాజిక బధ్రత, వివిధ సందర్భాలలో పిల్లలు ఎదుర్కుంటున్న సమస్యలపై వారి పట్ల  స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని కోరింది. పిల్లలు సహజంగా చాలా అమయంగానే పుడతారు. కొన్ని రాకల్ సమస్యల వల్ల వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్థూ ఉంటారని. అందులో కొన్ని సున్నిత మైనవిమరికొన్ని చట్టం తో ముడి పడ్డ ఆంశాలుగా విశదీక రింకారు.

                                           
పిల్లల్లో ఎలాంటి ప్రవర్తన ఉంటుంది అంటే ఉద్రేక పూరితం గాను బయటి కి భావాన్ని వ్యర్థమ్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు కన్నీటి పర్యంతం అవుతూ మరికొందరు కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు. ఈ క్రమం లోనే చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడడం. దుర్భాష లాడడం. ఇతరుల పట్ల విచక్షణ కోల్పోడం.అనుచిత ప్రవర్తన, తరచుగా చిన్నప్పుడే అలవడడం  ఖద్దు. ఏ మైనప్పటికీ తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు ఇతరులు అంటే పిల్లల  సంరక్షణ బాధ్యతలు చూసే వారే  పిల్లలకి నయానో భయనో చెప్పి చూడాలే తప్ప వారిపట్ల ఖటినంగా వ్యవహరించడం కొట్టడం సరికాదని.                                                                           
తెలిసి తెలిసి ఎవరు నేరం చేయరు అయితే అందుకు కారణమైన పరిస్థితులు పరిశీలించి. ఏ కరణాల వల్ల పరిస్థితుల వల్ల  నేరం  చేశారు.

అక్కడ జరిగిన ఘటనలో  ఏ బాలుడు బాలిక నేరం చేశారని రుజువైందా? చిన్న చిన్న నేరాలు లేదా తీవ్ర  నేరాలు ఆరోపించ బడ్డ  బాలుర పట్ల ఎలా వ్యవహరించాలి?

అన్న సమస్య కు జువనైల్ జస్టిస్ కొన్ని మార్గ దర్శకాలను సూచించింది. చైల్డ్  కన్ఫ్లిక్ట్ విత్ లా  అన్న అంశంలో జువానైల్ జస్టీస్ సెక్షన్ 2(13) ప్రకారం 18 సంవత్సరాలు నిండని బాల బలికలు నేరం ఒప్పుకుంటే నేరం రుజువు ఐనా అతని నేరం ఆధారంగా శిక్షించవద్దని,  నేర తీవ్రత ఆధారంగా, ఉద్దేశ పూర్వకంగా నేరం చేయలేదని, నేర ప్రవృత్తి అతనికి లేదని,,  అందుకు  గల కారణాలను,  సామాజికి ఆర్ధిక, అంశాలు క్రోడీకలించాలని ఆ త్రువాతే   పరిమితులతో కూడిన  శిక్ష ,లేదా వ్యక్తి గత శిక్ష లేదా అతని ప్రవృత్తిలో మార్పు వచ్చేవిధంగా తగిన శిక్ష ను ఖరారు చేయాలని జువనైల్ జస్టిస్ సూచించింది. ఈ అంశాలపై అసలు సమస్యల పై చేసిన విశ్లేషణ, పరిశోదన  చూద్దాం.   2015 నాటికి జాతీయ స్థాయిలో  ఇతర నేరాలతో పోలిస్తే  బాలనేరస్తుల   గణాంకాల లో  జాతీయ  నేరాల పై  వచ్చిన రిపోర్ట్ ఏమి చెపుతోందో చూద్దాం.                                                                                                                                                          
బాల బాలికలు జువనైల్ జస్టిస్  చట్టాన్ని వ్యతిరేకించడం  సరికాదని అభిప్రాయపడింది. బాల బాలికల సంరక్షణ, రక్షణ. అత్యవసరమని  జువనైల్ జస్టిస్  చట్టం  2015 లో పేర్కొంది. ముఖ్యంగా  18 సంవత్సరాలు నిండని బాల బాలికలు   ఏదైనా ఒక నేరం చేసినట్లు రుజు వైతే   జువనైల్ కమీషన్ వేసే నాటికి అతని లేదా ఆమె వయస్సు తక్కువ  అయినట్లు అయితే, ఆ నేరం చేసి నట్లు బాలురు ఒప్పుకుంటే. తనకు సరైన వాతావరణం లేని కరణంగా, లేదా  ఆ నేరం  చేసేందుకు మరో నేపధ్యం ఉన్నప్పుడు. అతనికి మరో కొత్త జీవి తాన్ని  ప్రారంభించేందుకు అవకాశం ఉంది.

కొన్ని నేరాలలో  నేర తీవ్రత ఆదారంగా , అందులో ఉద్దేశ పూర్వకంగా, నేరం చ్యలేదని, స్వత హా గా అతడు నేర ప్రవృత్తి గల మనస్తత్వం అతనిది లేదా ఆమెది కాదని, ఆ కేసు విషయం లో  నేరస్తులు గా చెప్పబడుతున్న వారి లో నేరం చేసే   తత్వం అందులో లేనప్పుడు,  అక్కడి వాతావరణం, పరిణామాలు అందుకు  గల కారణాలు, సరైనవి కానప్పుడు వీటిని చిన్న చిన్న నేరాలుగా  మాత్రమే పరిగ నించాలని జువనైల్ జస్టిస్ సూచించింది.

అతని నేరం ఆధారంగా శిక్షించ  వద్దని తేల్చి చెప్పింది.  తప్పు చేసినా అతను లేదా ఆమె వారి విషయంలో వ్యక్తి గత శిక్ష, లేదా అతని ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా చర్యలు ఉండాలని సూచింది. వారి అవసరాలను గమనిస్తూ సామాజిక, మానసిక సంబంద మైన విషయా ల పట్ల కూడా నిశ్చింతగా  గమనించాల్సిన అవసరం ఉందని జువనైల్ జస్టిస్  నొక్కి చెప్పింది.                                                                       
అసలు బాల బాలికలు ఎందుకు  బాల నేరస్తులుగా  మారుతున్నారు.జాతీయ స్తాయిలో  నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లో ఇప్పటికే 31, 396 మంది  బాల నేరస్తులు  ఉన్నట్లు నేషనల్ క్రైమ్  రిపోర్ట్ లో పేర్కొంది. ఇతర క్రైమ్ రిపోర్ట్  తో పోలిస్తే   2.1% మాత్రమే మెజారిటీ ఉందని ఆ రిపోర్ట్  లో పేర్కొన్నారు. అయితే ఇందులో ఉన్నవారు  చాలామంది  చిన్న చిన్న నేరాలు చేసిన వారే  అని రిపోర్ట్లో వివరించారు.  తల్లి తండ్రులు  ఆర్ధికంగా బల హీన పడిన వారు బలహీన వర్గాలకు చెందిన వారు 42.5% ఉన్నారని. మొత్తం మీద ఇందులో 11.5% మంది నిరక్ష రాస్యులే, ఉండడం గమనార్హం.  ఇతర  వర్గాల  వారు 43.4 %ఉన్నారని అందరూ ప్రాధమిక స్థాయిలో  చదువు కున్న వారని పరిశోధన లో తేల్చారు.  బాల నేరస్తులు చేసే రక రకా  ల   నేరాలను  ఏ విధంగా నిర్వచించిందో చూద్దాం.                                                                                    
 
 ఇక్కడ  బాలలే నేరస్తులు అసలు బాల నేర స్థులు
 చేసే నేరాన్ని వివిధ రకాల నేరాలను నిర్వచించారు.

                                                                                                                                                      
వివిధ రకాల నేరాలకు పాల్పడినట్లు వివిధ రకాల నేరాలను జువనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం ఈ క్రింది విధంగా నిర్వచించారు. 

చిన్న చిన్న నేరాలుతగాదాలు....

చిన్న చిన్న నేరాలకు భారతీయ శిక్ష స్మృతి లోని ఐ పి సి సెక్షన్ ప్రకారం 3 సంవత్సరల్ కారా గార శిక్ష

తీవ్ర మైన నేరాలు...

తీవ్రమైన నేరాలు చేసి నప్పుడు భారతీయ శిక్షా  స్మృతి లోని ఐ పి సి సెక్షన్ ప్రకారం తాత్కాలికంగా 3నుంచి 7 సంవత్సరాల కారాగార శిక్ష విదించాలని జువనైల్ జస్టిస్ సూచించింది.                                                                                                                                                
అతి తీవ్రమైన నేరాలు...

అతి తీవ్రమైన  నేరం చేసిన వారికి భారతీయ శిక్షా స్మృతి ప్రకారం 7 సంవత్స రాల ఖటిన కారా  గార శిక్ష విదించాలని సూచించింది.రకరకాల  వృత్తులు వ్యక్తి గత  సామాజిక వ్య్వస్థ ప్రభావం బట్టి వాళ్ళు  బంధీలు గా అంటే ఆ బందనాలలో ఉన్నందున  అలావ్యవహరిస్తున్నారని అభిప్రాయ పడ్డారు.                                                   
                                                                
వ్యక్తి గత సా మాజిక వ్యవస్థ పై ప్రభావం  ఉంటుంది.                                                                    
ఇండివిడ్యువల్  డెలీ కుఎంసీ అంటే  వ్యక్తి  గత జప్తు.                                        
మరొకరి ప్రోత్సాహం తో జప్తు.                           
నిర్మాణాత్మక, లేదా ప్రేరేపిత జప్తు.                                                                         
సందర్బోచిత జప్తు.
                                 
ఇన్ని రకాల  జప్తు లకు ఒక్కో దానికి ఒక్కో రకమైన సామాజిక మాధ్యమం దీని పై విశ్లేషించాలి. అలాగే ఈ  ఆంశాల పై చివరగా  వారికి ట్రీట్మెంట్. ఐ వ్వడం తప్పని సరి.                                           

వ్యక్తి గత జప్తు...

ఈ  విషయంలో ఒక్క వ్యక్తి పాల్గొన్నట్లు తెలుస్తోంది. జప్తు చట్టం ప్రకారం వ్యక్తి గత మైన జప్తు వ్వ్యవహారమ్ లో కేవలం వ్యక్తి గత పర మైనా మానసిక స్థితి, వారి వాదన కేవలం జప్తు  అంశం   మానసిక సం బంధమై సమస్య లే కారణమని  చెప్తున్నారు . బాల్యంలో ప్రాధమిక స్థాయిలో పెరిగిన పెద్ద  సమస్య  గా మారి పెద్ద  లోపంగా పేర్కొన్నారు.అసలు వ్యక్తి గత జప్తు, ,వర్గ సహకారం తో జప్తు, నిర్మాణాత్మక జప్తు,  పరిస్థితులకు తల వంచే జప్తు , అన్న అంశాల ను  వివరంగా తెలుసుకుందాం.                                    
                                                                                      
ఈ అంశాల పైన వివరంగా నిపుణులతో, మానసిక నిపుణుల తో  చర్చిద్దాం.....                                                                   
పైన  చర్చించిన అంశాలను విశ్లేషించి నప్పుడు ఒకే విష్యం సహజంగా కనిపిస్తుంది.మన సిక శాస్త్ర వేత్తలు, నిపుణులు  విశ్లేషించిన అంశం లో వ్యక్తి గత జప్తు బలీయంగా నాటుకు పోయి నప్పుడు అది  అబద్దానికి దారి  తీస్తుంది.వ్యక్తి సమూహంలో ఉన్నప్పుడు అంటే కొంత మంది  ప్రోత్సహించడం, లేదా చాలా వ్యూహాత్మకంగా ప్లాన్డ్ గా పద్దతి ప్రకారం వారితో నిర్బంధంగా చేయించడం,  ఆ ప్రక్రియలో సహజంగా  బాల బాలికలు అబద్దం ఆడడం చేస్తూ ఉంటారు.

సామాజికంగా సరైన నిర్మాణం, లేకపోవడం , వివిధ వర్గా ల మధ్య సమతౌల్యం లేక పోవడం, వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం. ఆర్ధికంగా సామాజికంగా కంగా ఇతరులతో పోటీ పడలేని స్థితి, విజయం సాధించేందుకు చేసే ప్రయత్నం లో వేసే చిన్న్బ తప్పటడుగు బాల బాలికల జీవి  తానికి శాపంగా పరినమిస్తుంది  నేరం చేసి  బతకడం కష్టం బఠాకడమూ కష్టమే ఆకలివేసిన ఆరోగ్యం బాగోకున్న బతికేస్తున్న చిన్న చేతులు బాల నేరస్తులను ఆడుకునేది ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. కోవిడ్ వచ్చినా మరే వ్యాధి వచ్చినా చెప్పుకోడానికి ఎవరు లేరు  వారి మాట ఎవరు వినరు మరి భావి భారాతం ఎక్కడ ?  .