Read more!

థర్డ్ వేవ్ వచ్చేసిందా?

 

అంటే అవుననే అంటున్నారు నిపుణులు.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 25 దేశాలాలో  తన ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కోరోనా థర్డ్ వేవ్ ప్రారంభ మైందా ? రోజు రోజుకు  పెరుగుతున్న కోరోనా పోజిటివ్ కేసులు. విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోతూ ఉండడం తో డిల్లి విమానాశ్రయం కిటకిట లాడుతోంది. వేలాదిగా ఆర్ టి పి సి ఆర్ పరీక్షలకోసం ఘంటల  తరబడి  ప్రయాణీకులు వేచి చూస్తున్నారు.  ప్రయాణీకులతో కిటకిట లాడుతున్న డిల్లి విమానాశ్రయం పరిస్థితి చూస్తే ఎవరికీ కోరోనా పోజిటివ్ వస్తుందా ఏ క్షణాన ఒమైక్రాన్ విస్పోటనం పేలుతుందో అని డిల్లి సర్కార్ బెంబేలు పడిపోతోంది.

భారత్ లో మూడవ విడత ఒమైక్రోన్ ప్రభావం చూపు తొంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలనుండి  వస్తున్న సమాచారం ప్రకారం రాజస్తాన్, కర్ణాటకా,తమిళ్ నాడు,తెలంగాణ ,మహారాష్ట్రలలో  నిర్వహిస్తున్న పరీక్షలలో  కోవిడ్ పోసిటివ్ గా  గుర్తిస్తున్నారు. ఈమేరకు ఆయా రోగుల నమూనాలాను  జీనో మి సీక్వెన్స్ పరీక్షలకు పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటె తెలంగాణా లోని కరీంనగర్ జిల్లలో వైద్య కళా శాల విద్యార్ధులకు కోరోనా పోజిటివ్ గా నిర్ధారణ కావడం  తీవ్ర  ఆందోళనకు గురిచేస్తోంది. కరీమ్ నగర్ జిల్లాలోని చల్ మేరా ఆనంద రావు ఇన్స్టిట్యుట్  ఆఫ్  సైన్సెస్ కళా శాల  లోని 43 మంది వైద్య విద్యార్ధులకు కోరోనా పోజిటివ్ గా గుర్తించడం పట్ల అటు తల్లి తండ్ర్లులు ఇటు యాజమాన్యం  తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారు.

కాగా గత వారం రోజులుగా విద్యా సంస్థలలో నే కోవిడ్ కేసులు రావడాన్ని గమనించవచ్చు. ఇదిలా ఉండగా కళాశాలాల లోనే కోరోనా కేసులు రావడాన్ని బట్టి చూస్తే వారు ప్రత్యక్షంగా తరగతులకు హాజరు  కావడమే అని  నిపుణులు అంటున్నారు. ఓమై క్రాన్ త్వరితగతిన విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపధ్యంలో పోజిటివ్ కేసుల లో ఓమై క్రాన్   ఉందే మో? అన్న అనుమానం కలిగిస్తోంది.దేశంలో మొత్తం మీద ఓమైక్రాన్ కేసులు నమోదు కావడం  తో  అందునా ముఖ్యంగా బెంగళూరు,లోని స్ఫూర్తి కళా శాల లో 182 కేసులు,హైదరాబాద్ లోని టెక్ మహేంద్ర వైద్య కళా శాల లో  కోరోనా పోజిటివ్ కేసులు బయట పడుతూ ఉండడం తో కళాశాల లలో  విద్యార్ధులు రోజూ హాజారు కావడమే దీనికి కారణం గా  పేర్కొంటున్నారు.

ముఖ్యంగా కరీంనగర్ లోని చల్ మేరా ఆనంద్ రావు వైద్య కళాశాలలో నిర్వహించిన కళా శాల వార్షికోత్సవం లో 2౦౦ కు పైగా విద్యార్ధులు పాల్గొనడం వల్లే కోరోనా వచ్చిందా అన్న సందేహం కలుగుతోంది. కాగా కళా శాల వేడుకలలో ఎవారూ మాస్క్ ధరించక పోవడం ప్రాధాన కారణమై ఉండవచ్చని జిల్లా వైద్యఆ ధికారులు పేర్కొనడం గమనార్హం. అయితే కళాశాల వార్షికోత్సవం అంశం తమ కు తెలియదని  వార్షికోత్సవం వారం రోజుల క్రితం నిర్వహించారని దీనికారణం గానే కోవిడ్ వ్యాప్తి  జరిగి ఉండవచ్చని. కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి జువేరియా మీడియాకు తెలిపారు. కళా శాల లో జరిగిన వేడుకలకు పెద్దసంఖ్యలో విద్యార్ధులు  గుమిగూడడం వల్లే చాలా మందికి మాస్క్ ధరించాలేదని వైద్య అధికారులు వెల్లడించారు.

2౦౦ మంది పైగా విద్యార్ధులు పరీజ్షలు చేయగా  అందులో 43 మంది  విద్యార్ధులకు పోజిటివ్ వచ్చినట్లు తేలిందని.పరిస్థితిని దృష్టిలోఉంచుకుని ప్రత్యేక శిబిరం ద్వారా  మరో 1౦౦౦ మందికి  పరీక్షలు చేయగా మొత్తంగా 43 మందికి పోజిటివ్గా  గుర్తించారని పేర్కొన్నారు. హైదరాబాద్,సంగారెడ్డి జిల్లలో ని ప్రభుత్వ పాట శాలలో,ఇంద్రేశం లోని మరో పాట శాలలో  విద్యార్ధులకు కోరోనా సోకడం పై త్ఘీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా విదేశాల్ నుండి వచ్చిన మరో 13 మందికి కోరోనా పోజిటివ్ గా నిర్ధారణ కావడం తో   జీనోమ్ సీక్వెన్స్  పరీజ్షకు పంపారు. రోజురోజుకు  కోవిడ్ సోకిన వారి సంఖ్య పెరుగుతూ ఉండడం తో అటు సామాన్యులు అధికారులు,ప్రభుత్వ వర్గాలలో దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తీవ్రైబ్బందులు పడుతున్నారు. 

బాధితుల పట్ల  ఇలాగేనా ప్రవర్తించేది...కాస్త మనుషుల్లా చూడండి ...

ఇది ఇలా ఉంటె లండన్ నుండి వచ్చిన ఒక మహిళ కు కోరోనా నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారని  వెంటనే మరో గంటలో  ఆమెకు పోజిటివ్ వచ్చిందని తెలిపారని ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపొమ్మని అధికారులు వేదిన్చారని అధికారుల ప్రవార్తన తో తను తమ కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురి అయినట్లు  ఆమె సెల్ఫి వీడియోను ఒక ప్రముఖ చానల్ కు పంపినట్లు సమాచారం.  రెండు విడతలుగా వచ్చిన కోవిడ్  బారిన పడిన వారికి చుక్కలు చూపిన అధికారులు తమ అసహనాన్ని ప్రదర్శించడం  పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా రోగులను కనీసం మనుషుల్ల చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.  

ఒక చిన్న తప్పిదం వందల మంది కి కోరోనా సోకడానికి కారణమా 

రెండవ విడత చేసిన నష్టాన్ని మర్చిపోకముందే మూడో విడత  వ్యాప్తి పెరగడాన్ని  నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే జరిగిన కోరోనా విస్తరణలో విద్యార్ధులు పెద్దఎ త్తున హాజరు కావడమేనని నిపుణులు అంటున్నారు. కాగా తాజా  పరిస్థితి దృష్ట్యా  తమ పిల్లలను బడికి పంపాలా వద్ద అన్నసందేహం తల్లి తండ్రులను వేదిస్తోంది.ఇది ఇలా ఉంటె  పాట శాలాకు వెళితేనే పటాలు చదు వుకోగలుగుతున్నామని  విద్యార్ధులు ఉపాద్యాయులు అనడం గమనార్హం.అసలు విద్యార్ధులను  కళా శాలకు పంపడం పాట శలాకు పంపడం వల్లే కోరోనా పోజిటివ్ వచ్చిందని అంటున్నారు తల్లి తండ్రులు. కళాశాలలు పాట శాలాలు తెరిచే ముందు పునరాలోచించాలని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టుబట్టి తిరిగి ప్రారంభించడం వల్లే  కోరోనాకు కారణమని అనుకుంటున్నారు.