Read more!

అతిగా కూర్చు౦టే అన్ని ఇబ్బందులే!

ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చునే అలవాటు వుంటే వెంటనే ఆ అలవాటును మార్చుకోండి. అప్పుడప్పుడు అలా నడుస్తూ వుండండి అంటూ సూచిస్తున్నారు పరిశోధకులు. లేకపోతే మీ అయ్యుష్హు ను మీరే తగ్గించుకున్న వాళ్ళవుతారు, అనికూడా చెబుతున్నారు మనలో చాలామంది మెలకువగా వున్నపుడు 95% సమయాన్ని కూర్చునే గడుపుతున్నమట, దీనివలన గుండె జబ్బులు,అధిక రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఉదాహరణకి కుర్చీలోంచి కదలకుండా 60 నిముషాలు టీవీ చూస్తున్న ప్రమాదమే అంటే అర్ధం చేసుకోండి స్థిరంగా ఓ చోట కూర్చోవడమనేది ఎంత ప్రమాదమో!

 

మనం కదలకుండా ఓ చోట కూర్చున్నపుడు మన శరీరంలో లైపో ప్రోటీన్ లైపేజ్ అంటే LPL  అనే ఎంజైమ్ పనితీరు మందగిస్తుందట! ఇది వ్యాక్యూమ్ క్లీనర్ లా పనిచేస్తూ రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్ ను పీల్చుకుని కండరాల రూపంలోనికి మారుస్తుంది. కదలకుండా కూర్చున్నప్పుడు ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో రక్తంలో కొవ్వు పేరుకుపోయి చివరికి అది పొట్ట తదితర బాగాల్లోకి నిల్వగా చేరిపోతుంది. అలాగే ఎక్కువసేపు కదల పొతే కండరాలు మందకొడిగా తయారై బిగుసుకుపోతాయ్. మన వెన్నుకు కూడా కూర్చోవటం సరిపడదట, ఎందుకంటే మన వెన్నెముక నిలబడేందుకు వీలుగా రుపొందిందింది. గంటల వెన్నుని నిటారుగా ఉంచి కూర్చోవాలంటే వీపు లేకపోతె వెన్నెముక చాలా బలంగా వుండాలి.


వెన్నెముక అలా ముందుకు వంగినపుడు,భుజాలు కిందకి వాలిపోతాయి. క్రమంగా అది భుజాలు, మెడ, నడుం నొప్పులకి దారి తీస్తుందట కాబట్టి అతిగా కూర్చుని వుండటం వలన అన్ని ఇబ్బందులే!