Read more!

వ్యాక్సిన్ కు ముందు, తరువాత, పెయిన్ కిల్లర్స్ వాడవచ్చా?

కరోనా వ్యాక్సిన్ కు  ముందు, తరువాత, పెయిన్ కిల్లర్స్ వాడవచ్చా? అన్నది ఒక సందేహం శరీర తత్వాన్ని బట్టి అత్యవసరమైతే తప్ప పెయిన్ కిల్లర్స్ ను వాడకపోవడం ఉత్తమం అంటున్నారు  డాక్టర్లు. కొన్ని పెయిన్ కిల్లర్స్ వ్యాక్సిన్ పై ప్రభావం చూపుతాయని అంటున్నారు.  మనం తీసుకునే వ్యాక్సిన్ శరీరంలో బూస్టర్ ను పెంచేందుకు ప్రయత్నిస్తుంది. వైరస్ కు వ్యతిరేకంగా వైరస్ ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది . దీనివల్ల సహజంగా జ్వరం , తలనొప్పి, కండారాల నొప్పులు,  తాత్కాలికంగా వస్తాయని అన్నారు. ఈ లక్షణాలకు  ఆర్ధం ఏమిటి అంటే ? మీ ఇమ్యున్ సిస్టం రీవైవ్ అవుతున్నట్లే అని అంటే, వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లే అని అంటున్నారు వైద్యులు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్  కంట్రోల్ ప్రివెన్షన్  డైరెక్టర్  డాక్టర్ రోచ్ ఎల్లె వాటెన్ స్కై ఈ విషయాన్నీ మీడియాకు వివరించారు. పెయిన్ కిల్లర్స్ లక్ష్యం ఇంఫ్లామేషణ్ ను తగ్గించేందుకే అని ఇందులో ఇబు ఫ్రోబిన్, ఎవిల్ , మార్టిన్ వంటి బ్రాండ్లు ఇమ్యునిటీని తగ్గిస్తాయని విశ్లేషించారు. ఇందులో భాగంగా ఎలుకలపై చేసిన పరిశో దనలో వెల్లడి అయ్యిందని రోచ్ వివరించారు. వైరాలజీ జనరల్ లో  ఈ అంశాన్ని ప్రస్తావించారు. పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల యాంటీ బాడీలు ఉత్పత్తి తగ్గుతుందని ఇంఫెక్టింగ్ సెల్ల్స్ వైరస్ ను అదుపు చేయడం కష్టమని పేర్కొన్నారు. డాక్టర్ ను  సంప్రదించిన తరువాతే పెయిన్ కిల్లర్స్ వాడాలని డాక్టర్  రోచ్ సూచించారు. అవసరమైతే acetamin ophen (tylenot) సురక్షితమని సూచించారు. ఈ మందు ఇమ్యూన్ సిస్టం ను నివారించదని అన్నారు. సిడిసి కొన్ని సూచనలను చేసింది. ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ తడి గుడ్డను లేదా చల్లటి ఐస్ ముక్కను గుడ్డలో ఉంచి అక్కడ అప్లై చెయ్యాలని సూచించింది. మీరు వేసుకునే బట్టలు బిగుతుగా ఉండరాదని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత చేయి ఎర్రగా మారినా చేయి వచ్చిన డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు.