వైఎస్‌ షర్మిల అరెస్ట్.. దీక్ష భగ్నం

నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాల భర్తీపై వైఎస్ షర్మిల చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిల దీక్షకు పోలీసులు ఒక్కరోజుకే అనుమతి ఇవ్వగా.. ఆమె మాత్రం 72గంటల పాటు దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. దీంతో.. సాయంత్రం కాగానే దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు.

తాను 72 గంటల దీక్షకు పూనుకున్నానని.. తనను ఎక్కడికి తరలించినా అక్కడే దీక్ష కొనసాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు. పాదయాత్రగా ఇందిరాపార్కు నుంచి లోటస్ పాండ్‌కు బయలు దేరారు షర్మిల. దీంతో.. పాదయాత్రకూ అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులతో తోపులాట జరిగింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ఱ దగ్గర షర్మిలను అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.