ఇలా వార్నింగ్.. అలా డిలీట్

 చిన్నారులతో అసభ్యంగా మాట్లాడిస్తూ   వీడియోలు తీసే యూట్యూబర్లు,  ఇన్ స్టా రీల్స్ బ్యాచ్కు సజ్జనార్ వార్నింగ్ తో వెన్నులో వణుకు పుట్టింది.  ప్రేమికుల పేరుతో చిన్నారులను, మైనర్లను తీసుకువచ్చి తీసుకువచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ వ్యూస్, లైక్స్ కోసం నైతికతకు తిలోదకాలిచ్చి మరీ సొమ్ము చేసుకుంటున్న యూట్యూబర్లకు సజ్జనార్ ఓ ట్వీట్ ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 అటువంటి చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.    మీరు ఫేమస్ అవ్వడానికి చిన్న పిల్లల భవిష్యత్తును ఎందుకు ఫణంగా పెడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసమని హైదరాబాద్ సిపి ప్రశ్నించారు. ఇలా అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు అంటూ సిపి ఆగ్రహించారు. సమాజ అభివృద్ధికి కృషి చేసే విధంగా ఇంటర్వ్యూలను చేయాలి. కానీ ఇలా యువతను, మైనర్ల ను తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదంటూ హెచ్చరించారు.

 మైనర్లతో అసభ్యక రమైన కంటెంట్ చేసిన వాటిని తక్షణమే తొలగించకుంటే..  కఠినమైన చర్యలు తీసుకోవ డం జరుగుతుం దని సజ్జనార్ తన ట్వీట్ లో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు బెంబేలెత్తిపోయి అటువంటి వాటిని వెంటనే డిలీట్ చేశారు.   ఇంస్టాగ్రామ్ లో ఉన్న రీల్స్ కూడా డిలీట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu