మహిళలపై వైసీపీ నేతల దాడి.. 

ముందు బెదిరిస్తారు.. ఆ తరవాత ఝలక్ ఇస్తారు.. మాట వినకుంటే దాడులు చేస్తారు.. అవసరం అనుకుంటే అంతం చేస్తారు. ఆ జిల్లా పచ్చని  పొలాలకు పెట్టింది పేరు.. అలాంటి జిల్లాలో కూడా రక్తం చిందిస్తున్నారు.. దాడులు చేస్తున్నారు.. మహిళలు అని చూడకుండా కొట్లాటకు తెగబడుతున్నారు. వైసీపీ నాయకులు. 

అది పచ్చని పైరు చీరగా కట్టుకున్నజిల్లా. ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామం. అతని పేరు వేంకటేశ్వరావు కుటుంబం సాపాటు కోసం ఆటో నడుపుతున్నాడు. ఏపీలో ఎన్నికలు వచ్చాయి. కొంత మంది పండుగ చేసుకుంటున్నారు. అతను మాత్రం బతుకుదెరువు కోసం తన ఆటోను ఎన్నికల ప్రచారంలో పెట్టాడు.. 

కట్  చేస్తే.. కాకర్లమూడి లో మహంకాళమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఊరి జనం అంత ఉత్సవాల్లో మునిగిపోయారు. వెంకటేశ్వరావు కుటుంబం కూడా మహంకాళమ్మ ఉత్సవాల్లో పాల్గొంది. అంతలో ఎక్కడి నుండి వచ్చారో తెలియదు.. 15 మంది  పెను ఉప్పెనలా విరుచుకుపడి వెంకటేశ్వరావు కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు. ఏంటి ఎక్కడో సినిమాలో సీన్ లా ఉందనుకుంటున్నారా.. కానేకాదు. మరి వాళ్ళు ఎవరు. అసలు వెంకటేశ్వరావు కుటుంబం పై ఎందుకు దాడి చేశారు. తనకి ఆ దుండగులకు పాత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా.. అని అనుకుంటున్నారా.. మీరే చూడండి.    

పంచాయతీ ఎన్నికలే ఈ దాడికి కారణం. అతను తెదేపా మద్దతుదారుల ప్రచారం కోసం ఆటో పెట్టారు. వైసీపీ కి సపోర్ట్ చేయకుండా.. టీడీపీకి చేస్తావా అని పగ పెట్టుకుని మంగళవారం రాత్రి గ్రామంలో మహంకాళమ్మ ఉత్సవాలు జరుగుతుండగా సుమారు 15 మంది కలిసి వెంకటేశ్వరరావు కుటుంబంపై కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో వెంకటేశ్వరరావు, అతని కుమార్తె మార్తారత్నంతోపాటు ఆపడానికి ప్రయత్నించిన వారి బంధువులు మద్దాల పండు, దారం మరియమ్మ, మద్దాల మహంకాళి, దారం కాంతారత్నంలపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితులు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై చేబ్రోలు ఎస్సై వీర్రాజు మాట్లాడుతూ అది మద్యం మత్తులో జరిగిన గొడవని, దీనికి రాజకీయ కక్షలు కారణం కాదన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.