బంద్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం.. డీజీపీ హెచ్చరిక

బీసీ సంఘాలు శనివారం నిర్వహించతలపెట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు కానీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గానీ పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షణ చేస్తాయన్నారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలు  ఎదురవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu