ఛీ .. ఛీ సిగ్గేస్తోంది మంత్రి రోజా తీరుపై మహిళల ఆగ్రహం

ఆమె స్వతహాగా సినిమానటి ... ఒకప్పటి హీరోయిన్... నటన ఆమె వృత్తి ... అందువలన ఆమె ప్రవర్తన అలా ఉందని కాదు. అలాగే, నటీనటులు, హీరోలు, హీరొయిన్’లు అంతా ఒకేలా , సభ్యత, సంస్కారం మరిచి  అంతే అసభ్యంగా ప్రవర్తిస్తారని అసలే కాదు. కానీ, ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న, మాజీ నటీ, ప్రస్తుతం మంత్రి రోజా కాస్త చాలా బోల్డ్ టైపు లేడీ, ఎవరినీ లెక్కచేసే రకం కాదు. అది ఎవరో ఆమెకు ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. ఆమె స్వయంగా తనకు తాను ఇచ్చి పుచ్చుకున్న  కితాబు . ఆపైన సుదీర్గ కాలం ‘జబరస్త్’ టీవీ షో లో జడ్జిగా,పగలబడి నవ్వడం (కొంత మంది గిట్టని వాళ్ళు వెకిలిగా, అసభ్యంగా,అసహ్యంగా నవ్వడం అని కూడా అంటారు) బాగా ప్రాక్టీసు చేశారు.

సరే, ఆ షో ‘ఎలా ఉంటుంది .. ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యంగా ఉంటుంది అనేది వేరే  విషయం వేరే చర్చ. కొంత మంది  అయితే బూతు కామెడి షో లన్నిట్లోకి ‘జబర్దస్త్’ ఖతర్నాక్ నెంబర్ వన్, షో అని అంటారు.అలాగే,  బూతు కామెడి షోలకు  ‘జబర్దస్త్’ పెట్టింది పేరని అంటారు. సరే, ఎవరు ఏమనుకున్నా, ఆ షోను జనం విరగబడి చూస్తున్నారు అనుకోండి అది వేరే విషయం. లోకో భిన్న రుచి హి.. ఎవరి ఎవరి టేస్ట్ వారిది. కొంత మందికి అలాంటి కామెడీనే బాగుంతుంది. అందులో రోజా ఒకరు. 

అయితే ఆమె, మరో సెలబ్రిటీ అయితే అదోరకం.. కానీ, ఆమె ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి  పైగా ‘గౌరవ’ మంత్రి... సో ఆమె  గౌరవం. ఆమెకు మాత్రమే సొంతం కాదు. శ్రీ శ్రీ అన్నట్లుగా, ‘మీమీ వ్యక్తిగత జీవితాలు, మీమీ సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్నట్ల్గు ఆమెను ప్రవర్తనను ప్రశ్నించ వలసి వస్తోందని అంటున్నారు. 

ఆమె నటిగా ఉన్నత కాలం, జబర్దస్త్ షో .. జడ్జిగా ఉన్నంతకాలం పూర్వాశ్రయంలో ఆమె ఏమి  చేశారు అనేది, ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ, ఇప్పడు ఆమె కేవలం ఒక నటి, జబర్దస్త్ షో .. జడ్జి మాత్రమే కాదు, ఒక గౌరవప్రదమైన స్థానలో ఉన్న మహిళా. ఒక మంత్రి. సో.. ఆమె కొంత హుందాగా, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆశించడంలో తప్పులేదని సామాన్యులు బావిస్తున్నారు. అయితే,  అదేమీ దురదుష్టమో. పాత వాసనలు ఆమెను వదలడం లేదులా  వుంది. వెనకటి వేషాలే వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమే, గతంలో జబర్దస్త్ వేషాల గురించి విమర్శలు వచ్చినప్పుడు, ఆమె, నటన తమ వృత్తని. దర్శకులు చెప్పిన విధంగా నటించడమే తమ కర్తవ్యమని, నట జీవితం వేరు, నిజ జీవితం వేరు .. రెంటిని ముడి పెట్టి చూడరాదని, తమ ప్రవర్తనను సమర్ధించుకున్నారు.

అయితే. రోజా మంత్రి అయినా, ఆమె ప్రవర్తనలో, మాట తీరులో మార్పు రాలేదనేది, ఇప్పడు ఆమె పై వస్తున్న ప్రధాన విమర్శ. నిజానికి, ఆమె మంత్రిగా చేసేది, చేయగలిగింది ఏదీ లేదు. ఆమాట కొస్తే  జగన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులకు ఉన్న విలువ ఏ పాటిదో వేరే చెప్ప నక్కర లేదు, అందుకే, హేమాహేమీలకే దిక్కులేదు, రోజా అనగా ఎంత, అని ఆమె అనుచరులే, ఆమె ముఖం మీద కాకున్నా, చాటుగా  అని నవ్వుకుంటున్నారు. 

అయితే ఇప్పడు ఇంతలా ఆమె గురించి మాట్లాడుకోవడానికి, భీమవరంలో జరిగిన మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు శత జయంతి వేడుకల వేదిక పై ఆమె ప్రవర్తించిన తీరే కారణమని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధనమంత్రి, ముఖ్యమంత్రి సమక్షంలో ఆమె ప్రవర్తన  మంత్రి పదవికి హుందాతనం తెచ్చేలా లేదని విమర్శకులు అంటున్నారు. నిజం ఎవరో విమర్శించారని కాదు, ప్రధానమంత్రితో సెల్ఫి తీసుకోవాలనే కోరిక సహజంగా ఎవరికైనా ఉంటుంది. అయితే, అందుకు సమయం, సందర్భం ఉంటుందనే స్పృహ లేకుండా,తాను మంత్రి అనే విషయం  మరిచి పోయినట్లు ఆమె ప్రవర్తన ఉందని విమర్శకులు తప్పు పడుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి  చికాకు పడే వరకు,ఆమె సెల్ఫి ‘గోల’ ఆపక పోవడం విమర్శలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు.  

అదలా ఉంటే, మంత్రి అయిన తర్వాత, ఇటీవల కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు,  ఆమెను ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆమె ఇమేజ్ ని మరింతగా దిగజారుస్తున్నాయని, సిగ్గుతో తలవంచు కుంటున్నామని సామాన్య మహిళలు కూడా అంటున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రేపులు పెరిగిపోతున్నాయని, అంటే, ఏంటి, ఒకటి రెండు రేపులకే అంత ఇదై పోవాలా, గోల చెయాలా అంటూ ఆమె ఇచ్చిన సమాధానం, మహిళలు తల వంచుకునేలా ఉందని మహిళలే ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు, అల్లూరి జయింతి ఉత్సావాలను ఆమె తమ ప్రవర్తనతో  అపవిత్రం చేశారని.. కార్యక్రమం స్పూర్తిని అగౌరవ పరిచే విధంగా మంత్రి రోజా ప్రవర్తన ఉందని, ప్రతిపక్షాలు ప్రజలు,సామాన్య మహిళలు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందైనా, రోజా, పాత వాసనలు వదిలిచుకోవడం మంచిదని లేదంటి మంత్రి పదవి పోయినా మరకలు మాత్రం అలాగే ఉంటాయని, ఆమె మంచికోరేవారే అంటున్నారు. ఆమె వింటారా?