పట్టపగలే గొంతు కోసి హత్య.. ప్రేమోన్మాది ఘాతుకం
posted on Oct 17, 2025 11:18AM
.webp)
పట్టపగలే 20 ఏళ్ల మహిళను దారుణంగా గొంతు కోసి హతమార్చిన సంఘటన బేంగళూరు నగరంలో గురువారం జరిగింది. ప్రేమ పేరుతో వెంటపడి తిరస్కారానికి గురైన ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళఊరులోని శ్రీరాంపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో గురువారం (అక్టోబర్ 16) మధ్యాహ్నం జరిగింది.
వివరాల్లోకి వెడితే.. యామిని ప్రియ అనే 20 ఏళ్ల యువతిని విఘ్నేష్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యామినిప్రియ అతడి ప్రేమను నిరాకరించి, వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో పగ పెంచుకున్న విఘ్నేష్ దారి కాచి యామినిప్రియను దారుణంగా హత్య చేశాడు.
బనశంకరిలోని ఒక కళాశాలలో బి ఫార్మసీ చదువుతున్న యామిని ప్రియ కాలేజీలో పరీక్ష రాసి మధ్యాహ్నం వేళ తిరిగి ఇంటికి వస్తుంగా.. బైక్ పై వెంబడించిన విఘ్నేష్ మల్లేశ్వరంలోని మంత్రి మాల్ సమీపంలో ఆమె కళ్లల్లో సాల్ట్ పౌడర్ చల్లి అనంతరం గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విఘ్నేష్ కోసం గాలిస్తున్నారు.