మొదటి రాత్రి షాక్ ఇచ్చిన వరుడు..

ఓపెన్ చేస్తే అది గుంటూరు జిల్లా. నర్స రావుపేట చెందిన మహిళ.  తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తోంది. తన కుమారుడు ఉన్నాడు అతనికి పెళ్లి చేయాలనుకుంది. ఒక పెళ్లి చెయ్యాలంటే వంద అబద్దాలు ఆడాలని మన పూర్వికులు చెప్పారు కాబట్టి.. తన కొడుకు పెళ్లికోసం ఒక చిన్న అబద్దం చెప్పింది. తన కొడుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పింది. కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగడు అన్నట్లు. కొడుకు పెళ్ళికి అన్ని కుదిరాయి.  గుంటూరుకు చెందిన యువతితో మే 26న వివాహం జరిపించారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి కట్నకానుకలు కూడా భారీగా  ఇచ్చారు. పెళ్లి ఘనంగా జరిపించారు. పెళ్లి ఘనంగా జరిగింది కాబట్టి ఆ తదుపరి కార్యం కూడా ఘనంగా జరగాలనుకుంది వరుడి తల్లి.  తన కుమారుడి తొలిరాత్రి భువనేశ్వర్‌లో జరగాలని అత్త ఒత్తిడి చేసింది. అందుకు  యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నర్సరావుపేటలో ఏర్పాటు చేశారు. మొదటి రాత్రి  తన భర్త వింత ప్రవర్తనతో వధువు అవాక్కయ్యింది. అతడి గురించి ఆరా తీస్తే షాకయ్యే విషయాలు తెలిశాయి.. దీంతో అత్తింటివారు తనను మోసం చేశారని పోలీసుల్ని ఆశ్రయించింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.బాధితురాలు చెబుతున్న వివరాల ప్రకారం.

మొదటి రాత్రి భర్త ఆమె దగ్గరకు వచ్చాడు. ఈ వయసులో కోరికలు ఎక్కువ ఉండకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత ఏవో టాబ్లెట్ వేసుకొని నిద్రపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు రోజులు భర్త  అలాగే చేశాడు.. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఆవేశాన్ని తట్టుకోలేక భర్తను నిలదీసింది.. భార్య, భర్తలు అంటే శారీరక సంబంధం పెట్టుకోవడం కాదని, మంచి స్నేహితులుగా ఉందామనే మాటలు చెపుతూ భర్త మరో షాకిచ్చాడు. భర్త దెబ్బకు ఆ కొత్త పెళ్లి కూతురు కంగుతింది.. అదే రోజు అతడు మింగే టాబ్లెట్లు అయిపోగా..అసలు విషయం తెలిసింది. ఆ టాబ్లెట్లు వేసుకోకపోతే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందన్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదు. మానసిక స్థితి సరిగాలేదంటూ చెప్పడంతో యువతి షాకయ్యింది.

పెళ్లి జీవితం.. భర్త తో ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కన్నా ఆ మహిళా ఒక్కసారిగా విస్తుపోయింది. గుండెల్లో బాధలు దాచుకోలేక  భర్త లోపాలను ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వచ్చి అత్తను ప్రశ్నిస్తే తన కుమారుడు ఆరోగ్యవంతుడేనని, తలనొప్పికి మాత్రలు వేసుకుంటున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. తన కుమారుడికి వైద్యం చేసే డాక్టర్‌‌ను అడగమని చెప్పింది.. రిటైర్ అయిన ఓ వైద్యుడికి ఫోన్‌ ఇచ్చింది. ఆ యువతి వైద్యుడిని ప్రశ్నించగా అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ యువకుడికి మానసిక స్థితి సరిగాలేదని, మాత్రలు వాడకపోతే ప్రమాదమని చెప్పడంతో అవాక్కైంది. వరుడికి ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నా మభ్యపెట్టి ఎందుకు పెళ్లి చేశారని తన అత్తను యువతి ప్రశ్నించింది. ఆమె గొడవపెట్టుకొని తమపై బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన అత్తకు ఉన్న పరిచయాలతో కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమను మోసం చేసిమానసిక రోగితో పెళ్లి చేసి మోసగించిన అత్త, భర్త పెళ్లిళ్ల మధ్యవర్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.


ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమంటే.. ఉద్యోగం ఉంది.. కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉంది అని కక్కుర్తిపడి.. పిల్లల జీవితాలు నాశనం చేయకండి.. వరుడి గురించి వధువు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాకే పెళ్లిళ్లు చేయండి.. పెళ్లి అంటే వందేళ్ల జీవితం. డబ్బు ఆస్తి ఉంటే అవసరాలు తీరుస్తాయి గానీ మనుషుల మనోభావాలను అర్థం చేసుకోవు..