రెండో పెళ్ళిని ఆపిన ఈ మెయిల్!
posted on Jul 11, 2014 2:48PM

ఈ మెయిల్ ఒక మంచి పని చేసింది. ఒక ప్రబుద్ధుడు రెండో పెళ్ళి చేసుకోబోతుంటే ఆపింది. అదెలా జరిగిందంటే, శ్రీలంకకి చెందిన శాంతి వాసన్, సీతకి కెనడాలో పరిచయమైంది. వాళ్ళిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడి, అనంతరం పెళ్ళి కూడా చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత శాంతివాసన్‌కి సీత అంటే మొహమ్మొత్తింది. ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో శాంతివాసన్ తన మాజీ ప్రియురాలిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి సీతని కెనడాలోనే వదిలేసి కొచ్చిన్ వచ్చాడు. తన లవర్ని రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. దాంతో సీత శాంతి వాసన్ తనకు చేసిన మోసాన్ని తిరుచ్చి నగర పోలీస్ కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే స్పందించిన కమిషనర్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. సీతతో సహజీవనం చేశానని, ముగ్గురు పిల్లలు కూడా తమకు ఉన్నారని శాంతి వాసన్ చెప్పడంతో పోలీసులు శాంతి వాసన్ తన లవర్‌తో చేసుకుని రిజిస్టర్ మ్యారేజీని రద్దు చేశారు.