పెంచలయ్య కుటుంబానికి అండగా ఉంటా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరులో గంజాయి బ్యాచ్ చేతుల్లో హతమైన పెంచలయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా నిలిచారు. బుధవారం (డిసెంబర్ 3) ఆ కుటుంబాన్ని పరామర్శించిన కోటంరెడ్డి.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా  ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చారు. కాగా  పెంచలయ్య కుమారుల చదువుల బాధ్యతను తాము తీసుకుంటామని కోటంరెడ్డి కుమార్తెలు హైందవి, వైష్ణవిలు హామీ ఇచ్చారు.  

పెంచలయ్య సాగించిన గంజాయివ్యతిరేక పోరాటానికి కలిసొచ్చే అన్నిపార్టీలతో కలసి ఆ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అలాగే గంజాయి బ్యాచ్  గురించి భయం అవసరం లేదనీ, తాను అండగా ఉంటాననీ ఆర్డీటీ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. వారం రోజులలో కాలనీ అభివృద్ధికి 50లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానన్నారు. భావి తరాలకు గుర్తుండేలా పెంచలయ్య విగ్రహాన్ని కాలనీలో ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీ వాసులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా కోటం రెడ్డి కాలనీవాసులకు హామీ ఇచ్చారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu