వస్తున్నా.. న్యాయవాదిని తెచ్చుకుంటా.. సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ

సీబీఐ నోటీసుల మేరకు తాను శనివారం (జనవరి 28) విచారణకు హాజరౌతున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి శనివారం (జనవరి 28)  హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొన్న సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తాను శనివారం  సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.  కేసు విచారణ పారదర్శకంగా సాగాలని   ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని ఆ లేఖలో కోరారు. అలాగే తనతో పాటుగా తన న్యాయవాదిని కూడా అనుమతించాలని ఆ లేఖలో కోరారు.