ఐ బొమ్మ రవికి భార్యే బొమ్మాళి?
posted on Nov 17, 2025 1:30PM

పెళ్లాం చెబితే వినాలి అంటారు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పెళ్లాం చెప్పింది వినక పోవడం వల్లే అడ్డంగా బుక్ ఐపోయాడా? అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఇమ్మడి రవి ఫ్రాన్స్ లో ఉంటాడు. అతడి భార్య తో అతడికి విబేధాలున్నాయి. దీంతో అతడు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. ఎలాగైనా సరే వాటి నుంచి బయట పడ్డానికి ప్రతయత్నం చేసిన అతడు ఇండియా వచ్చాడు. ఇలాంటి అనైతికపరులు కూడా న్యాయపరమైన చిక్కుల నుంచి బయట పడాలనుకుంటారా? అన్న మాట అటుంచితే.. ఈ విషయం గుర్తించిన రవి భార్య, అతడి జాడ పోలీసులకు చూపించేసింది. దీంతో అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.
ఇక్కడ అందరూ అంటోన్న మాట ఏంటంటే ఎంత వాళ్లయినా సరే పెళ్లాం చెబితే వినాలి. భార్యని కాదని బతికి బాగు పడ్డ వారు చరిత్రలో లేరు అన్న కామెంట్లు చేస్తున్నారు. కనీసం భార్యతో సెటిల్మెంట్ చేసుకుని ఉన్నా సరిపోయేది తన దగ్గర అంత డబ్బు ఉన్నా సెటిల్ చేసుకోకుండా ఇక్కడి పోలీసులతో ఎదురు తిరిగినట్టు భార్యతోనూ ఎదురు తిరగాలని ట్రై చేసిన రవి తాను తీసిన గోతిలో తాను పడడం చర్చనీయాంశంగా మారింది.అప్పటికీ రవి అకౌంట్లో కోట్లాది రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో కొంత భాగమైన భార్యకు ఇచ్చి వ్యవహారం చక్క పెట్టుకోకుండా ఇలా బుక్ అయిపోయాడేంటని జనం ఒకటే గుస గుస.
రవి ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తే ఇప్పట్లో ఇతడు చిక్కడన్న నిర్దారణకొచ్చారు సామాన్య జనం. కానీ ఇక్కడే అతడి తలరాత తిరగబడింది. బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చస్తుందని సమతీశతకంలో చెప్పినట్లుగా ఎంత తెలివిగలవాడైనా సరే ఒక్కోసారి తమకు అత్యంత దగ్గర్లో ఉండే భార్యల ముందు బొక్కబోర్లా పడుతుంటాడనడానికి ఐబొమ్మ రవి అరెస్టు నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు చాలా మంది.