భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే.. ఇవి పాటించండి..!

 

భార్యాభర్తల బంధం.. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి జీవితాంతం తోడు ఉండేది భార్యాభర్తల బంధమే.. మధ్యలో వచ్చే జీవిత భాగస్వాములు జీవితాంతం కష్టాల్లోనూ, సుఖాలలోనూ,  బాధలలోనూ తోడు ఉంటారు.  అయితే నేటి కాలంలో భార్యాభర్తల  బంధాలు చాలా పేలవంగా మారిపోయాయి.  విడాకులు ఎక్కువ అయ్యాయి.  చీటికి మాటికి గొడవలు జరగడం,  చిన్న విషయాలే విడిపోవడం వరకు దారితీయడం జరుగుతున్నాయి.  అలా కాకుండా భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా ఉండాలన్నా, భార్యాభర్తల మధ్య ఎలాంటి విషయాలు వారి బంధాన్ని విడదీసేంత ప్రభావం చూపించకూడదు అన్నా.. కొన్ని విషయాలు గుర్తుంచుకుని వాటిని పాటించాలి.

మాట్లాడటమే కాదు.. వినాలి కూడా..

భార్యాభర్తల మధ్య బంధంలో మాట్లాడటం,  తమ పరిస్థితిని,  తమ బాధను,  సమస్యను తమ భాగస్వామితో చెప్పుకోవడం మామూలే.. అయితే కొందరు తాము చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పడానికి చూపించినంత ఆసక్తిని ఎదుటివారు చెప్పేది వినడానికి చూపించరు. అలా కాకుండా భార్యభర్తలు ఇద్దరూ తాము చెప్పే విషయంతో పాటూ.. ఎదుటివారు చెప్పేది కూడా శ్రద్దగా వెంటే చాలా వరకు వారి మధ్య సమస్య చిన్నగా ఉండగానే పరిష్కారం అవుతుంది.


చర్చించాలి..

మనసులో ఉన్న ఏదైనా విషయాన్ని భాగస్వామితో చెప్పాలి అనుకుంటే దాన్ని డిస్కస్ చేసినట్టు చెప్పాలి. అంతేకానీ వాదించినట్టు,  గొడవ పడినట్టు ఎప్పుడూ చెప్పకూడదు.

గౌరవం..

భాగస్వామితో ఎప్పుడైనా ఏదైనా విషయం గురించి విబేధించాల్సి వచ్చినా,  విబేదిస్తున్నా దాన్ని గౌరవంగానే చెప్పాలి. అంతేకానీ కోపంలో గౌరవాన్ని వదిలి  అరవడం,  ఏకవచనంలో నిందించడం,  అసభ్య పదజాలం వాడం చేయకూడదు.

ప్రశంస..

ప్రశంస ప్రతి ఒక్కరికి మంచి బూస్టింగ్ ఇస్తుంది.  భాగస్వామిని ప్రసంశించడం వల్ల బంధం ఆరోగ్యంగా ఉంటుంది.  భాగస్వామి చేసే ఏ పనిని అయినా సరే.. నచ్చితే మొహమాటం లేకుండా మెచ్చుకోవాలి.  ఎలాంటి ఇగో లకు తావు ఇవ్వకూడదు.

హ్యాపీ సొల్యూషన్..

భార్యాభర్తల బంధంలో ఏదైనా సమస్య వస్తే.. దాన్ని పరిష్కరించడానికి గొడవను ఎంచుకోవద్దు. దానికి బదులుగా శాంతియుతంగా దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి.

సమయం..

ఇప్పటి జనరేషన్ లో వాళ్లు ఉద్యోగాలు, బిజీ లైఫ్ ల కారణంగా ఒకరితో ఒకరు కలిసి ఉండే సమయం చాలా తక్కువ. దీని వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రోజులో ఇద్దరూ కొంతసేపు ఏకాంతంగా గడపాలి.  ఇద్దరూ కలిసి తినేలా,  ఇద్దరూ కలసి బయటకు వెళ్లేలా, ఇద్దరూ కలసి వంట చేసుకోవడం,  వర్కౌట్స్ చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి.

వన్ సైడ్ నిర్ణయాలు వద్దు..

భార్యాభర్తలు  ఏదైనా పని చేయాలని అనుకున్నా, ఏవైనా ప్లానింగ్ లు వేసినా అవి ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు అయి ఉండాలి.  అలా కాకుండా భార్యాభర్తలలో భర్త లేదా భార్య మాత్రమే నిర్ణయం తీసుకుని భార్యను ప్రేక్షకపాత్ర వహించేలా చేయకూడదు. దీని వల్ల భార్య తనకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదని అనుకుంటుంది. ఇది తక్షణమే కాకపోయినా కాలక్రమంలో గొడవలకు,  విబేధాలకు దారి తీస్తుంది.


                                       *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu