వ్యవసాయ చట్టాల రద్దు ఇలాగా.. మోడీకి భయమెందుకు ? 

ఈ పాడు చట్టాలు మాకొద్దు బాబో  అని సంవత్సరం నుంచి రైతులు మొత్తుకున్నరు,  ఆందోళన చేస్తున్నా, పట్టించుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఒక్క  సారిగా కళ్ళు తెరిచింది. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసింది. ఈరోజు, (సోమవారం) ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజునే పార్లమెంట్ ఉభయ సభలు, వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదముద్ర వేశాయి. నిజమే, ఇది స్వాగతించ వలిసిన పరిణామమే, ఆరు నూరైనా,ఏది ఏమైనా సాగు చట్టాల విషయంలో భీష్మించుకు కూర్చున్న ప్రభుత్వం. ఏడాది పోరాటంలో 750 రైతులు ప్రాణాలు పోయినా, ఈ చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాలు చేసిన ఆందోళన కారణంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలే తుడిచి పెట్టుకు పోయినా, చివరకు జాతీయ జెండాకు అవమానమే జరిగినా, చలించని మోడీ సర్కార్, ఇప్పటికైనా కళ్ళు తెరవడం కొంత వరకు సంతోషించవలసిన పరిణామమే. 

అయితే సాగు చట్టాలను తెచ్చినతీరు ఎంత సుందర ముదనష్టంగా ఉందో ... ఇప్పుడు చట్టాలను వెనక్కి తీసుకున్న తీరుకూడా అంతే, వికారంగా, వికృతంగా ఉందని రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలను పరిహసించే విధంగా ఉందని అంటున్నారు. నిజానికి, ఈ చట్టాలు తెచ్చేముందు, ప్రభుత్వం  ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు. రైతు సంఘాలతో చర్చించలేదు. ఇంకా సిగ్గు చేటైన వ్యవహారం ఏమంటే, మంత్రి వర్గంలో కూడా సమగ్ర చర్చ జరగలేదని, సంఘ్ పరివార్ సంస్థలే ఆరోపించాయి. పార్లమెంట్’లోనూ అదే పరిస్థితి. విపక్షాల అభ్యంతారాలు అన్నీ అధికార పక్షం మందబలంలోకొట్టుకు పోయాయి. ప్రధాని  మోడీ ముచ్చట తీరింది. అందుకు చెల్లించిన మూల్యం 750 నిండు ప్రాణాలు. అలా ... రాజరిక అవలక్షణ అవశేషంగా మిగిలిన వ్యక్తిస్వామ్యానికి ప్రతీకగా పుట్టిన సాగు చట్టాల రద్దులోనూ అవే వక్ర లక్షణాలు పునరావృతం అయ్యాయి. 

చట్టాల రద్దు నిర్ణయం విషయంలో కూడా ప్రధాని మోడీ ఒంటరిగానే నిర్ణయం తీసుకున్నారో. ఆయన మంత్రి వర్గంలో కాదు, రద్దు నిర్ణయానికి ముందు  కనీసం వ్యవసాయ శాఖ మంత్రితో అయినా చర్చించారో లేదో అనుమానమే. అయినా నిర్ణయమే అందరికీ శిరోధార్యం అయింది. కేవలం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలను దృష్టిలో ఉంచుకుని మోడీ తీసుకున్న ఒంటరి నిర్నయంగానే పరిశీలకులు అంటున్నారు. అందుకే మంత్రివర్గంలో చర్చించిన దాఖాలాలు లేవు. ప్రదానిని నోట వెంట వచ్చే వరకు సాగు చట్టాల రద్దు నిర్ణయం జరిగిన వాసన కూడా ఎక్కడా రాలేదు.ఆలాంటి సంకేతాలు అయినా అందలేదు. గురునానక్ జయంతి సందర్భంగా గుట్టు చప్పుడు కాకుండా, ప్రధాని ఏకంగా ఒకే సారి రద్దు నిర్ణయం ప్రకటించారు. ఇక ఇప్పుడు, పార్లమెంట్ చట్టాల రద్దు ప్రక్రియ కూడా అలాగే కానిచ్చేశారు. ఒక చర్చ లేదు ... ఒక వవరణ లేదు .. చట్టాలు చేయ్దం .. చేసిన చట్టాలను రద్దు చేయడం ... అయితే  ఆయన ప్రధాని కావచ్చును ,.. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి జరగడం ప్రజాస్వామ్య పరిహాసం తాప మరొకటి కాదని అంటున్నారు.   

ఎందుకలా... అంత తొందర ఏమొచ్చింది? చట్టాలు ఎందుకు తెచ్చారు..? ఎందుకు ఉపసంహరించుకున్నారు?  అలాగే, ఒకప్పుడు  తాము అధికారంలో ఉన్నప్పుడు ఇవే చట్టాలు చేసేందుకు ప్రయత్నించిన విపక్షాలు, ఇప్పడు అవే చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అన్ని విషయాలు చర్చిస్తే పోయేదేముంది.. సందేహలు తప్ప అంటున్నారు విశ్లేషకులు.అలాగే, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన  చేసిన రైతులకు, ఖలిస్థాన్’ ఉగ్ర వాదులుగా ముద్ర వేశారు... మరి ఇప్పుడు ఏమంటారు ? అలాగే, రద్దు నిర్ణయం ప్రకటించిన సమయంలో ప్రధాని రైతులకు చెప్పిన క్షమాపణల అర్థమేమిటి? ఈ అన్నిటికీ సమాధానం రావాలంటే, పార్లమెంట్ లో చర్చ జరగటం ఒక్కటే మార్గం .. కానీ, మోడీ ప్రభుత్వం చర్చకు అవకాశం లేకుండా పలాయనం చిత్త గించింది.అంతే కాదు, ఇంతజరిగిన తర్వాత సశేషంగ మిగిలిన కనీస మద్దతు ధర (ఎంఎస్..పీ), రద్దయిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, జరిగిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని కోరడం తప్పు కాదు .. ఆ డిమాండ్లు కూడా అంగీకరించే వరకు ఆందోళన కొనసాగించడం నేరం అనిపించుకోదు. అందుకే పార్లమెంట్ లో చర్చ ఇంకా మిగిలే వుంది .. అంటున్నారు.