రోశయ్య చేసిన నేరం ఏమిటి? జగన్ పగకు అదే కారణమా? 

రాజకీయాలలో  ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాల్లో అజాతశత్రువు అనే మాటకు అర్థం లేదు. అలాంటి  వారు ఎవరూ ఉండరు. ఎంత మంచి మనిషి అయినా, ఇంకెంత గొప్ప నాయకుడే అయినా, వారికి కూడా శతృవులు అనివార్యంగా ఉంటారు. కానీ, చావులోనూ, శతృమిత్ర భేదం చూపే కుసంస్కారం మాత్రం అందరిలో ఉండదు. కొందరిలోనే ఉంటుంది. అలాంటి వికృతిని ఇప్పుడే చూస్తున్నాం ... అది కూడా ఒక ముఖ్యంత్రి స్థాయిలోని వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం ఆయనకే కాదు, రాష్ట్రానికి కూడా అవమానం. మాయని మచ్చఅంటున్నారు. 

సహజంగా  ఒక నాయకుడు చనిపోయినప్పుడు నివాళులు అర్పించడం, కుటుంబ సబ్యులను సభ్యులను పరామర్శించి, నాలుగు మంచి మాటలు చెప్పి రావడం సంస్కారవంతులు  ఎవరైనా చేసే పని. ముఖ్యంగా, ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎవరైనా ఈ పాటి సంస్కారం లేకుండా ఉండరు. చనిపోయిన వ్యక్తులు రాజకీయ ప్రత్యర్దులే అయినా, శవాన్ని కూడా ద్వేషించే సంస్కార హీనులు సహజంగా అయితే ఎవరూ ఉండరు. అలాని మనం  అనుకుంటాం.కానీ,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళ నాడు మాజీ గవర్నర్ అన్నిటినీ మించి తమ (వైఎస్) కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు, కొణిజేటి రోశయ్య మరణం పట్ల  ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించని తీరు చూస్తే, ఉంటారేమో అనుకోక  తప్పడం లేదు. 

అందుకే అనేక మంది ముఖ్యమంత్రి ప్రవర్తన విచారం, విషాదం మాత్రమే కాదు రాష్ట్రానికి అవమానం అంటున్నారు. అంతే కాదు జగన్మోహన్ రెడ్డి, దివంగత మాజీ ముఖ్యమంత్రిని అవమానించి  తనను తాను అవమానించు కున్నారు. తక్కువచేసుకున్నారు. ఈయన వెళ్లి నివాళులు అర్పించక పోవడం వల్లనో, కుటుంబాన్ని పరామర్శించక పోవడం వల్లనో పెద్దాయన రోశయ్యకు ప్రజల్లో ఉన్న గౌరవ, మర్యాదలు తగ్గిపోవు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనమంత్రి వర్గ సహచరులు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఇంకా అనేక   మంది మాజే ముఖ్యమంతరులు, మంత్రులు, విభిన్నవర్గాలకు చెందిన ప్రముఖులు స్వయంగా రోశయ్య భౌతిక కాయన్ని దర్శించుకుని నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ప్రభుత్వ లాంచనాలతో అత్యక్రియలు నిర్వహించింది. 

నిజమే రోశయ్య హైదరాబాద్ లో స్థిర పడ్డారు.అక్కడే కన్నుమూశారు. అయినా, ఆయన ఏపీకి చెందిన నేత..తెలుగు ప్రజల నాయకుడు. అయినా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దివంగత నేత రోశయ్య విషయంలో కనీసం ప్రోటోకాల్ నిబంధనలను కూడ పాటించలేదు.అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముగ్గురు మంత్రులను పంపి ఊరుకున్నారు. ఎందుకలా ప్రవర్తించారు, అందుకు జగన్రెడ్డి నిజమే అంత... రాజకీయాలకోసం తల్లినీ చెల్లినీ కూడా  దూరం చేసుకున్న ఆయన ముంచి ఇంతకు మించిన సంస్కారం ఆశించడం కూడా అన్యాయమే అనేవాళ్ళు ఉన్నారు. అలాగే,  వైఎస్ మరణం తర్వాత తనకు రావలిసిన ముఖ్యమంత్రి పదవి, రాకుండా రోశయ్య అడ్డుపడ్డారనే ఆక్రోశం, పగ ఆయనలో ఇంకా మిగిలే ఉన్నాయని, అనుకోవచ్చుననీ  అంటున్నారు.

నిజానికి వైఎస్సార్ హెలికాప్టర్  ప్రమాదంలో చనిపోయినప్పుడు,జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా  ముఖ్యమంత్రి పదవి తనకు దక్కుతుందని ఆశించారు. ఆశించడమే కాదు,  వైఎస్ అంత్యక్రియలు అయినా పూర్తికాకముందే , తమకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించారు. అయినా, కాంగ్రెస్ అధిష్టానం, సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని కాదని, రోశయ్యకు అవకాశం ఇచ్చారు. రోశయ్య అయిష్టంగానే, ముఖ్యమంత్రి పదవిని అంగీకరించారు..ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అనేక సందర్భాలలో, ఇంటర్వ్యూ లలో స్పష్టం చేశారు.. అయినా .. జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఆ పగ ఇంకా అలాగే ఉండిలా ఉంది .. అందుకే, ఆయన మరణించిన రోశయ్యను అవమానించి అనడం పొందుతున్నారు అనుకోవచ్చును. అయితే ఇది ఆయన అజ్ఞానం, కాదంటే మూర్ఘత్వం అనిపించుకుంతుందే కానీ ఇంకొకటి కాదని, అంటున్నారు.