మొంథా తుపాన్ ఇంతకీ తీరం దాటేదెక్కడ?

మొంథా తుపాన్.. ప్రళయభీకరంగా బంగాళాఖాతంలోంచి తీరం వైపుకు దూసుకువస్తున్న ఈ పెను తుపాను గత మూడు నాలుగు రోజులుగా మూడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. మూడు రాష్ట్రాలూ కూడా తీర ప్రాంతా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అన్ని ముందు జాగ్రత్త చర్యలతోనూ తుపాను నష్టం ప్రభావాన్ని అత్యంత కనిష్ఠానికి పరిమితం చేయాలన్న లక్ష్యంతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అయితే ఇంతకీ ఈ  మొంథా తుపాను ఎక్కడ తీరం దాటుతుంది?

ఏపీ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలు మూడూ కూడా తమ రాష్ట్రంలోని ఏదో తీరం వద్ద ఈ తుపాను దాటుతుందన్న అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నాయి. సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో అలర్ట్ గా ఉన్నాయి. ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మంగళవారం (అక్టోబర్ 28) సాయంత్రం లేదా రాత్రి ఈ మొంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఈ తుపాను కదలికలను నిశితంగా గమనిస్తున్న నిపుణుల సమాచారం మేరకు ఇది కొద్ది సేపు విశాఖకు సమీపంగా వస్తున్నది, అంతలోనే కాకినాడ తీరం వైపు కదులుతోంది. అలాగే కొంత మేర చెన్నైకి ఆగ్నేయంగా కదులుతోంది. దీంతీ తీరం చేరు సమయానికి తుపాను దశ ఎటు మళ్లుతుందో అన్న టెన్షన్ వాతావరణ శాఖకు పట్టుకుంది. అందుకే మూడు రాష్ట్రాలనూ కూడా పెను తుపాను ముప్పు విషయంలో అలర్ట్ చేస్తున్నది.

ఒక సమయంలో కాకినాడ తీరం కాదు.. కోనసీమ  జిల్లాలోని శంకరగుప్తం, పడమటి లంక మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న సమాచారం కూడా వాతావరణ శాఖ నుంచి వచ్చింది. ఆ తరువాత మళ్లీ కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే మంగళవారం (అక్టోబర్ 28) సమయం గడిచే కొద్దీ తుపాను కదలికలపై క్లారిటీ వచ్చిందనీ, ఇది కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ వాతావరణ శాఖ చెబుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu