తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? బీజేపీ మనసు మారేనా? 

అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం మరో మారు చర్చకు వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మనీష్ తివారి, కేంద్ర ప్రభుత్వం లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన కసరత్తు ప్రారంభించిందని, ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మనీష్ తివారీ  ట్వీట్  ప్రకారం  ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ స్థానల సంఖ్య రెట్టింపు గీతను కూడా దాటి ఏకంగా 1200 ప్లస్ సంఖ్యకు చేరుకుంటుంది. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా లోక్ సభ స్థానాల సంఖ్య రెట్టింపు గీతను దాటేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 25 స్థానాలు 52, తెలంగాణలో ప్రస్తుతమున్న 17 స్థానాలు 39కి చేరుకుంటాయి. 

నిజానికి, దేశంలో నియోజక  వర్గాల పునర్విభజన 2026 వరకు గడువుంది.అది కూడా 2021 జనాభా లెక్కల ప్రకారం జరగవలసి ఉంటుంది. కొవిడ్ కారణంగా 2021లో జరగవలసిన జనగణన జరగలేదు.ఆ కారణంగా నియోజక వర్గాల పునర్విభజన ఇంకొంత ఆలస్యం అయినా అవుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తేనే తుట్టెను కదిపింది. జమ్మూ కశ్మీర్’ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణలో భాగంగా నియోజక వర్గాల  పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. దీంతో నియోజక వర్గాల పునర్విభజన వివాదం మళ్ళీ మరో మారు తెరపైకి వచ్చింది.

ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మరో మెలిక కూడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 (రాష్ట్ర విభజన చట్టం) దేశంలో నియోజక వర్గాల పునః విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునః విభజనకు అవకాశం కల్పించిందనే అభిప్రాయాన్ని కల్పిచింది.ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ నియోజక వర్గాలను 225కు తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజక వర్గాలను 153కు పెంచుకోవచ్చని విభజన చట్టం సూచించింది. ఈ నేపధ్యంలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన అంశం తరచు చర్చకు వస్తోంది. వివాదానికి దారి తీస్తోంది. 

కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ సంచలనంగా మారిన నేపధ్యంలో, కాంగ్రెస్ ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, ఉభయ తెలుగు రాష్టలలోనూ 2026 తర్వాతనే నియోజక వర్గాల పునర్విభజన ఉంటుందని, అంతవరకు ప్రస్తుత స్థితే యథాతథంగా కొనసాగుతుందని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం సూచించిన విధంగా నియోజక వర్గాల పునర్విభజన చేపట్టాలంటే, రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని గతంలో చెప్పిన  విషయాన్నే నిత్యానంద రాయ్ మరోమారు స్పష్టం చేశారు. 

నియోజక వర్గాల పునర్విభజన ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న ప్రాతీయ పార్టీలు, ముఖ్యంగా తెరాస కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది.తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర సవతి తల్లి ప్రేమ చూపుతోందని, తెరాస సీనియర్ నాయకుడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విరుచుకు పడుతున్నారు. జమ్మూ కశ్మీర్ ‘ కు ఒక న్యాయం తెలుగు రాష్ట్రాలకు ఒక న్యాయమా అని నిలతీస్తున్నారు. కేంద్ర తలచుకుంటే, రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే, విభజన చట్టంలో చిన్న మార్పు చేస్తే నియోజక వర్గాల పునర్విభజన చేపట్ట వచ్చని అంటున్నారు. నిజమే, కానీ, ఒకే ఒక్క నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు, వేల కోట్ల రూపాయల పధకాలను ప్రకటించుకుంటూ పోతూ, అవును హుజురాబాద్’లో గెలిచేందుకే దళిత బంధు వంటి పథకాలు అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటింఛి నప్పుడు లేని తప్పు కేంద్రంలో అధికరమలో ఉన్న బీజేపీ  నియోజక వర్గాల పునర్విభజనలో రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటే తప్పవుతుందా? అని కమల దళం నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

తెరాసనే కాదు,బీజేపీ కూడా సన్యాసుల సత్రం కాదు, కదా. ఆవిషయాన్ని ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రామ్ మాధవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ముందు చెప్పారు కదా నాయి గుర్తు చేస్తున్నారు.  అదలా ఉంటే, కారణాలు ఏవైనా, అవి సహేతుకం అయినా కాకున్నా, ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలలో సీట్లు పెరగవు, తెలంగాణ అసెంబ్లీలో 119, ఏపీ అసెంబ్లీలో 175, లోక్ సభలో ఏపీకి 25, టీఎస్ 17...అంతే, ప్రస్తుతానికి ఇంతే.