దేశంలో గోధుమ వినియోగం, కేటాయింపు ఎందుకు త‌గ్గాయి?

దేశంలో గోధుమ వినియోగం రాష్ట్రాల కేటాయింపుల్లో త‌రుగుద‌ల విష‌యమై చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్రా ల‌కు గోధుమ‌ల కేటాయింపు విష‌యంలో అనేక వాద‌న‌లు విన‌ప‌డుతున్నాయి. మేలో జరిగిన రివిజ‌న్‌ తర్వాత, 10 రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ ఎఫ్ ఎస్ ఎ) కింద గోధుమ కేటాయింపులు తగ్గించబడ్డాయి, వీటిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,  గుజరాత్ ఆ స‌వ‌ర‌ణ‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రాలు ఎంత గోధుమలను వినియోగిస్తాయి, స‌వ‌ర‌ణ‌, మొద‌లైన అంశాల్లో పున‌రాలోచ‌న చేశారు. గుజరాత్ , ఉత్త‌ర ప్ర‌దేశ్‌  రెండు బిజెపి పాలిత రాష్ట్రాలు  బియ్యం స్థానంలో ఎక్కువ గోధుమలను డిమాండ్ చేశాయి.  ఎఫ్ ఎస్ ఎ, 2013 ప్రకారం వాటి అసలు కేటాయింపులను పునరుద్ధరించాలని లేదా గోధుమ, బియ్యం కేటా యింపు నిష్పత్తిని మార్చాలని కేంద్రాన్ని కోరడంతో  మే లో కేంద్ర ఆహార మంత్రి త్వ శాఖ సవరణ చేప‌ట్టింది. 

మే 14న,  కేంద్ర ఆహార భ‌ద్ర‌తా శాఖ‌ కార్యదర్శి సుధాన్షు పాండే  రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత ఎన్ ఎఫ్ ఎస్ ఎ కింద గోధుమలు , బియ్యం నిష్పత్తులను మార్చడం ద్వారా కేంద్రం కొన్ని పరిమాణాలను తిరిగి కేటాయించిందని ప్రకటించారు. ఉదాహరణకు, గోధుమలు, బియ్యం 60:40 నిష్పత్తిలో పొందు తున్న రాష్ట్రాలు ఇప్పుడు 40:60 వద్ద పొందుతాయి, అయితే 75:25 వద్ద కేటాయింపులు పొందుతున్న వారు ఇప్పుడు 60:40 వద్ద వీటిని పొందుతారు. బియ్యం కేటాయింపు సున్నా ఉన్న రాష్ట్రాలకు గోధుమలు అందడం కొనసాగుతుంది. చిన్న రాష్ట్రాలు, ఈశాన్య‌ రాష్ట్రాలు అలాగే  ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు, కేటా యింపులో మార్పు లేదు. ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ చర్య వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 10 నెలల (జూన్-మార్చి)లో సుమారు 61 లక్షల టన్నుల గోధుమలు ఆదా అవుతాయి.  కాగా, ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న (పిఎంజికెఎవై) క్రింద మిగ‌తా ఐదు మాసాల‌కు అంటే సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ కూడా  గోధుమ‌ల కేటాయింపుల్లో త‌రుగుద‌ల వుంటుంద‌నీ కేంద్రం ప్ర‌క‌టించింది. దీనివ‌ల్ల 55 ల‌క్ష‌ల ట‌న్నుల గోధుమ ఆదా అవుతుంద‌ని లెక్క‌వేశారు. ఇందుకు స‌మాంత‌రంగా బియ్యాన్ని గోధుమ స్థానంలో కేటాయిస్తారు. 

ఈ ర‌కంగా గోధుమ కేటాయింపుల్లో త‌రుగుదల వ‌ల్ల బీహార్‌, ఝార్ఖండ్‌, ఒడిషా, ప‌శ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, ఉత్త ర ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలపై ప్ర‌భావం వుంటుంది. ఎన్ ఎఫ్ ఎస్ ఎ కింద ఉన్న 81.35 కోట్ల మంది లబ్ధిదారులలో ఈ రాష్ట్రాలు దాదాపు 55.14 కోట్ల (67%) మంది ఉన్నారు. గుజరాత్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌లు ప్ర‌ధానంగా గోధుమ ఎక్కువ వాడే రాష్ట్రాలు కావ‌డంతో  వాస్త‌వంగా త‌మ‌కు కేటా యించిన మేర‌కు గోధుమ‌ల‌ను తిరిగి కేటాయించ‌మ‌ని డిమాండ్ చేస్తున్నాయి.  ఇంత‌కుముందు, యుపి ప్ర‌తీ ఒక్క‌రికి  3 కేజీల గోధుమ‌లు, 2 కేజీల బియ్యం ఎన్ ఎఫ్ ఎస్ ఏ క్రింద పొందేది. అదే ఇప్పుడు 2 కేజీ ల గోధుమ‌లు, 3 కేజీల బియ్యం అందుకునేట్టు మార్పు జ‌రిగింది. గుజ‌రాత్ 3.5 కేజీల గోధుమ‌లు, 1.5 కేజీ ల బియ్యం ప్ర‌తీ మాసం అందుకుంటుంటే ఇపుడు మారిన లెక్క‌ల ప్ర‌కారం 2 కేజీల గోధుమ‌లు, 3 కేజీల బియ్యం అందుకుంటున్న‌ది. అలాగే, రివిజ‌న్ త‌ర్వాత ఈ ప‌ది రాష్ట్రాల మొత్తం గోధుమ  కేటాయింపులు 9.39 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు త‌గ్గింది.  

కాగా ఈ రాష్ట్రాల‌కు  గోధుమ కేటాయింపుల్లో త‌రుగుద‌లకు స‌మాంత రంగా అద‌నంగా బియ్యం కేటాయింపులు చేప‌డ‌తారు.  ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్ ఎఫ్ ఎస్ ఏ క్రింద వాస్త‌వ కేటాయింపుల కంటే తక్కువ వుంటే, అది 2010-11 నుండి 2012-13 వరకు మునుపటి సాధారణ టిపిడి ఎస్‌ కింద సగటు ఆఫ్-టేక్ స్థాయి వరకు రక్షించబడుతుంది. ఈ అదనపు ఆహార ధాన్యా ల పరిమాణాన్ని ‘టైడ్ ఓవర్’ కేటాయింపు అంటారు. ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు ల గోధుమ టైడ్ ఓవ‌ర్ కేటాయిం పుల్లో త‌రుగుద‌ల‌ను ప్ర‌క‌టించారు. ఇది  సుమారు 1.13 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల మేర‌కు అద‌నంగా వుండ వ‌చ్చు. అయితే రివిజ‌న్ త‌ర్వాత ఆ రాష్ట్రాల టైడ్ ఓవ‌ర్ గోధుమ కేటాయింపులు జీరో స్థాయికి చేరుకుంటాయి. 

అస‌లీ కేటాయింపుల్లో త‌రుగుద‌ల వాస్త‌వానికి గ‌త ఏడాది కంటే ఈ ఏడాది  గోధుమ సేక‌ర‌ణ బాగా త‌క్కువ స్థాయిలో జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్న‌ది. ప్ర‌స్తుత ర‌బీ మార్కెట్ సీజ‌న్ (ఆర్ ఎం ఎస్‌-2022-23) లో జూలై 4 వ‌ర‌కూ 187.89 ట‌న్నుల గోధుమ సేక‌ర‌ణ జ‌రిగింది. ఇది ఆర్ ఎం ఎస్ 2021-22 యావ‌త్ గోధుమ సేక‌ర‌ణ 433.44 ట‌న్నుల కంటే 56.65 శాతం త‌క్కువ‌. ఇలా దేశంలో ప్ర‌ముఖ ఆహారోత్ప‌త్తి కేంద్రాలుగా చెప్పుకునే పంజాబ్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, యు.పి ల‌లో ఇదే ప్ర‌మాణం గ‌మ‌నించారు. 

సెంట్ర‌ల్ పూల్‌లో గ‌త 14 ఏళ్ల‌లో గోధుమ స్టాక్ త‌ల‌కిందుల‌యింది. జూన్ మొద‌టి రోజు 311.42 ట‌న్నులు వుంది. ఇది 2008241.23 ట‌న్నుల కంటే చాలా త‌క్కువ‌గా చెప్పాలి. గ‌తేడాది జూన్ ఒక‌టో తేదీన ఇది 602.91 మెట్రిక్ ట‌న్నులుగా పేర్కొన్నారు.  ఎఫ్ సి ఐ నిబంధ‌న‌ల  ప్ర‌కారం ఆహార ధాన్యాల నిల్వ‌లు  275.80 ల‌క్ష‌ల ట‌న్నులు ప్ర‌తీ ఏడూ జూలై ఒక‌టో తేదీన వుండేట్టు చూశారు. కానీ  ప్ర‌స్తుత నిల్వల వివ‌రా లు  ఇంకా  అధికారులు  తెలియ‌జేయ‌లేదు.