వాట్స్ యాప్ పుణ్యమా అని బతికిపోయాడు!
posted on Jun 24, 2014 5:56PM

మనం ఫోన్లలో సొల్లు కబుర్లు మెసేజ్ చేసుకోవడానికి ఉపయోగించే వాట్స్ యాప్ ఒక యువకుడి ప్రాణం కాపాడింది. నమ్మబుద్ధి కావట్లేదా.. ఇది నిజం. ఈ సంఘటన కర్నాటకలో జరిగింది. ఢిల్లీకి చెందిన గౌరవ్ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ తన ఫ్రెండ్స్‌తో కలసి బెంగుళూరుకు దగ్గర్లోని మధుగిరి హిల్స్ దగ్గరకి పర్వతారోహణ కోసం వెళ్ళాడు. తనతోపాటు వచ్చినవారు మర్నాటి నుంచి పర్వతారోహణ చేయాలని అనుకుంటే, గౌరవ్ మాత్రం తాను ఒక్కడినే వెళ్ళి కొండ ఎక్కుతానంటూ బయల్దేరాడు. గౌరవ్ పర్వతారోహణ చేస్తూ వుండగా పట్టుతప్పిపోయి ఒక లోయలో పడిపోయి స్పృహతప్పిపోయాడు. పర్వతారోహణ చేసి వస్తానని చెప్పిన గౌరవ్ ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరి అతని ఫ్రెండ్స్.కి భయం వేసింది. గౌరవ్ ఏ ప్రాంతంలో పర్వతారోహణ చేయడానికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. గౌరవ్ కోసం ఫోన్ చేసిన అతని ఫ్రెండ్స్‌కి ఫోన్ అందుబాటులో లేదని మెసేజ్ వస్తోంది. అప్పుడు వాట్స్ యాప్ ద్వారా గౌరవ్ ఫోన్ ఏ లొకేషన్‌లో వుందో కనుక్కుని అక్కడకి వెళ్ళి వెతికితే ఒక లోయలో గౌరవ్ కనిపించాడు. సమయానికి అతన్ని కాపాడి ఆస్పత్రిలో చేరిస్తే బతికి బయటపడ్డాడు. గౌరవ్ ఫోన్‌లో వాట్స్ యాప్ లేకపోతే గౌరవ్ ఈసరికి ప్రాణాలు కోల్పోయేవాడే!