జూబ్లీ బైపోల్ చాలా చిన్న ఎన్నిక.. కిషన్ రెడ్డి మాటల మర్మమేంటి?

జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. చెదురుమదురు సంఘటనలు వినా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఎంత? ఏ పార్టీ పట్ల జనం మొగ్గు చూపే అవకాశం ఉంది వంటి ప్రశ్నలకు కాసేపు పక్కన పెడితే.. పోలింగ్ ప్రారంభం కావడానికి గంటల ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఓ వ్యాఖ్య.. ఈ ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకోలేదా? లేక.. ఓటమిని అంగీకరించేసిందా? అన్న చర్చ మొదలైంది. అసలు మొదటి నుంచీ కూడా జూబ్లీ ఉన ఎన్నిక విషయంలో బీజేపీ అసలు రేసులో ఉందా? లేక ఆటలో అరటిపండు చందమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం మాదే అంటున్న బీజేపీ.. ఈ ఉప ఎన్నికలో విజయం ద్వారా తమ బలాన్ని ప్రదర్శించేందుకు గట్టిగా ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ అభ్యర్థి ఎంపికలో జాప్యం నుంచి ఎన్నికల ప్రచారం వరకూ బీజేపీ జూబ్లీ బైపోల్ ను చాలా లైట్ గా తీసుకుందని తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది.  ఒకపక్క జూబ్లీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతుంటే.. మరోపక్క సరిగ్గా పోలింగ్ కు గంటల ముందు ఇది చాలా చిన్న ఎన్నిక అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం.. బీజేపీ ఓటమి అంగీకర ప్రకటనలా ఉందంటున్నారు పరిశీలకులు.  అంతే కాకుండా.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేవిగా ఉన్నాయం టున్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu