విజయనగరం పోలీసు వాహనం బోల్తా.. కానిస్టేబుల్ మృతి..!
Published on: Sun Aug 23, 2026 4:34PM

విజయనగరం జిల్లాలో పోలీసు వాహనం బోల్తా పడిన ఘటన విషాదం నింపింది. కేసు విచారణ నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా కొండకరకం ఘాట్ వద్ద పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలు కాగా.. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ రమణ (45) మృతి చెందారు. పోలీసు వాహనం కొండకరకం ఘాట్ మీదుగా వస్తుండగా ఒక్కసారిగా బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న ఎస్‌ఐ, డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ రమణకు గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, ఇతర సిబ్బంది వెంటనే క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందించారు. అయితే కానిస్టేబుల్ రమణ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు విచారణకు వెళ్లి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో పోలీసు సిబ్బందిలో విషాదం నెలకొంది. ప్రమాదానికి బ్రేకులు పనిచేయకపోవడమే కారణమా.. లేక మరేదైనా సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Vizianagaram District Police Vehicle, Kondakarakam Ghat, Constable Ramana, Crime news, Home Minister Vangalapudi Anitha, CM Chandrababu


