వివేకా కేసులో మరో ట్విస్ట్

 

మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవరుగా మారిన దస్తగిరిని  బెదిరించిన ఫిర్యాదుపై కడప సెంట్రల్ జైల్లో కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. బుధవారం దస్తగిరిని, ఆయన  భార్య షబానాను  విచారించారు. ఈ కేసులో సాక్షిగా పులివెందుల ఇన్చార్జి  మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్టేట్మెంట్‌ను రికార్డ్ చేశారు. 

2023 నవంబర్ 28 దస్తగిరిని కడప జైల్లో వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బెదిరించినట్లు, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్తే  20 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు మాట వినకపోతే బయటకు వచ్చాక చంపేస్తామని బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారు. 

ఈ ఘటనపై విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ నియమించింది. ఈ మేరకుకడప జైల్లో మూడోసారి విచారణ చేపట్టారు. కమిటీ విచారణకు వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఆయన భార్య షబానా హాజరయ్యారు.

సాక్షిగా బిటెక్ రవి స్టేట్‌మెంట్

కడప జైల్లో విచారణకు బిటెక్ రవి సాక్షిగా హాజరయ్యారు. బీటెక్ రవి, దస్తగిరిని చైతన్య రెడ్డిని బెదిరించిన సమయంలో ఒక కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో కడప సైంట్రల్ జైల్లో దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్  చైతన్య రెడ్డి బెదిరించిన కేసులో సాక్షిగా విచారణకు  బీటెక్ రవి హాజరయ్యారు.‌ 

విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప సెంట్రల్ జైల్లో దస్తగిరి ఉన్న సమయంలో 2023  నవంబర్  14 నుంచి 29 వరకు  నేను రిమాండ్ ఖైదీ గా ఉన్నానని,నవంబర్ 28 న వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో సెంట్రల్ జైల్లోకి వచ్చాడని తెలిపారు.

ఆ సమయంలో నేను స్వర్ణముఖి బ్యారక్‌లో  ఉన్నానని, దస్తగిరి నాఎదురుగా బ్లాక్‌లో  ఉన్నాడని,నా బ్యారక్ ఎదురుగా చైతన్య రెడ్డి ఉండడం గమనించానని అన్నారు. దస్తగిరి బ్యారక్ లోకి చైతన్య రెడ్డి వెళ్ళడం నేను చూశానని అన్నారు.

కేసులో ముద్దాయిగా ఉన్న దస్తగిరిని అదే కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డిని జైల్లోకి అనుమతించడం ఆ రోజే జైలర్ ప్రకాష్ ను ప్రశ్నించానని తెలిపారు. వివేకా హత్య కేసులో దస్తగిరిని తమ అనుకూలంగా మారకుంటే చంపేస్తామని బెదిరించినట్లు తర్వాత తెలిసిందని అన్నారు. 

దస్తగిరిని బెదిరించిన సమయంలో నేను జైల్లో ఉన్నా కాబట్టి నన్ను సాక్షిగా విచారణకు పిలిచారని, జరిగిన ఘటనపై నాకు తెలిసిన విషయాలు విచారణ కమిటీ ముందు మొత్తం వివరించానని బీటెక్ రవి పేర్కొన్నారు.

దస్తగిరిని బెదిరించిన కేసులో సాక్షిగా నా స్టేట్మెంట్ రికార్డు చేశారని, 40 నిమిషాల పాటు విచారణ చేశారని అన్నారు. చైతన్య రెడ్ఢి మెడికల్ క్యాంపు పేరుతో జైల్లోకి అనుమతించడం పై ఆరోజే జైలర్ ప్రకాష్ ను ప్రశ్నించానని, ఇంత సమస్య అవుతుందని అనుకోలేదని జైలర్ చెప్పాడని అన్నారు. నా తరువాత దస్తగిరినీ కూడా విచారించారని ఆయన తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu