అప్పుల బాధతో... సొంత ఇంట్లోనే దోపిడీ
posted on Oct 10, 2025 9:50PM
.webp)
విశాఖలోని కంచరపాలెం ఇందిరానగర్ లో ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో మూడు రోజుల క్రితం దోపిడీ జరిగింది జీవీఎంసీ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లారు ఇంట్లో అతని తల్లి కొడుకు కృష్ణ కాంత్ మాత్రం ఉన్నారు అర్ధరాత్రి నిద్రపోతున్న దశలో ఇంటి వెనకనుంచి తలుపులు పగలగొట్టి నాన్నమ్మ మనవడు చేతులకు తాళ్లు కట్టి ముఖానికి ప్లాస్టర్ వేసి ఇంట్లో 12 తులాల బంగారం రెండున్నర లక్షల నగదును దోపిడీ చేశారు. ఆ అగంతకులు హిందీలో మాట్లాడారు దోపిడీ అనంతరం ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన వాహనంలోనే పరారయ్యారు. దీంతో ఆనంద్ కుమార్ రెడ్డి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు తొలిత భావించారు.
.. విచారణలో వెలుగు చూసిన నమ్మలేని నిజాలు
..
కాంట్రాక్టర్ ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ విచారణలో విశాఖ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమ్మలేని నిజాలను చూడాల్సి వచ్చింది. దోపిడి అనంతరం పోలీసులు క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు ఇంటి ఆవరణలో నిందితులు ఎత్తుకుపోయిన వాహనం నగర శివారులోని మధురవాడ వద్ద కనిపించింది. అనంతరం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని ఆధారాలు సేకరించారు. అందులో ఆనంద్ కుమార్ రెడ్డి తనయుడు కృష్ణ కాంత్ దినచర్యను ఆరా తీశారు. దోపిడీ జరిగిన అర్ధరాత్రి అతను కొందరుతూ ఫోన్లో మాట్లాడినట్టు నిర్ధారణ జరిగింది.
ఆ మేరకు విచారణ చేపట్టుగా వారంతా కృష్ణ కాంత్ స్నేహితులు గా తేలింది. పరపతి ప్రమోద్ కుమార్ షేక్ అభిషేక్ అవసరాల సత్య సూర్యనారాయణ అనే ఈ ముగ్గురు దోపిడీ జరిగిన కృష్ణ కాంత్ స్నేహితులు వీరంతా విలాసాలకు అలవాటు పడ్డారు. దీంతో సెల్ టవర్ల ద్వారా నిందితుల కదలికను వెంటాడారు. దోపిడీ జరిగిన రోజు వీరు కంచరపాలెం లో ఉన్నట్టు నిర్ధారణ అయింది ఆపై ఆ యువకులను పోలీసులు విచరించగా ఎన్నో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. కృష్ణ కాంత్ ఇటీవల కాలంలో ఆన్లైన్ ట్రేడింగ్ బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడ్డాడు. దీంతో ఇంట్లో ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు అయింది. అప్పుల పాలయ్యాడు. దీని నుంచి బయట పడేందుకు ఇంట్లోనే దొంగతనం చేయించి డబ్బు సంపాదించాలని భావించాడు. అందుకోసం ముగ్గురు స్నేహితులను సిద్ధం చేశారు.
ఇంట్లో తన తండ్రి లేని సమయంలో నాన్నమ్మతో ఒంటరిగా ఉన్నప్పుడు చేతులకు తాళ్లను కట్టి నోటికి ప్లాస్టర్ వేసి దొంగతనం చేయాలని అనంతరం పంచుకుందామని కృష్ణ గాని చెప్పాడు. నెల రోజులుగా చేస్తున్న ఆ ప్రయత్నం ఒకరోజు ఫలించింది కానీ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం నిందితులను పట్టించింది. నలుగురు నిందితులు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావడం విశేషం. ఇటీవల కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని.... విలాసవంతమైన జీవితం గడపాలని యువత ఆలోచన చేయడంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాచ్చి తెలిపారు. అయితే నేరం చేసిన వ్యక్తులు పోలీసులకు చిక్కడం ఖాయమని తద్వారా భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులకు హితవు పలికారు