విజయసాయి కొత్త అవతారం!

విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన సృష్టించిన సంచలనం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఆయన రాజీనామాకు కారణాలు, రాజీనామాకు వెనుక ఉన్న ఉద్దేశాలు, బీజేపీకి అదనంగా ఒక ఎంపీ సీటు ఇవ్వడం కోసమే నంటూ విశ్లేషణలు.. ఇందంతా జగన్ ప్లానే అన్న అనుమానాలూ ఇంకా సాగుతూనే ఉన్నాయి.

ఈ లోగానే విజయసాయి రెడ్డి తన కొత్త ఉద్యోగం మొదలెట్టేశారు. రాజీనామా ప్రకటన సందర్భంగా చెప్పినట్లు వ్యవసాయం చేయడం ఆరంభించేశారు. అలా మొదలెట్టేసి ఊరుకోలేదు. తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు ఎక్స్ లో పోస్టు చేశారు.  రాజకీయాలను దూరమై ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాననీ, ఈ వ్యాపకం తనకెంతో హాయిగా, సంతోషంగా ఉందంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. అసలు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వార్తే ఆశ్చర్యం కలిగిస్తే.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ స్వీకర్ క్షణం జాగు చేయకుండా ఆమోదించేయడం మరింత ఆశ్చర్యం కలిగించింది.

ఇక దానికి మించి విజయసాయిరెడ్డి చిప్పినట్లుగానే  వ్యవసాయ వ్యాపకంలోకి దిగిపోవడం ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తోంది.  విజయసాయి రెడ్డి తాజాగా రైతుగా తన పనుల్లో నిమగ్నమై ఉన్న ఫొటోలను ట్వీట్ చేశారు. ఆ ఫొటోల్లో ఆయన హార్టికల్చర్ సాగు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని చాటుకోవడానికి విజయసాయి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని తేటతెల్లమైపోతోంది. రాజకీయాలు వదిలేశాను ఇదిగో రుజువు.. ఇక నన్ను వదిలేయండి మహప్రభో అని కూటమి నేతలను అభ్యర్థిస్తున్నట్లుగా విజయసాయి ట్వీట్ ఉందంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu