విజయసాయి తండ్రి హంతకుడు.. రఘురామ సంచలన ఆరోపణ

రఘురామకృష్ణం రాజు.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం రచ్చబండ అంటూ టెలివిజన్లలో దర్శనమిచే లోక్ సభ సభ్యుడు. సొంత పార్టీ నుంచే వేధింపులు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణం రాజు వైసీపీపై, ఆ పార్టీ నేతలపై విమర్శలెన్ని చేసినా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి, రఘురామకృష్ణం రాజు మధ్య ట్వీట్ వార్ మాత్రం ఏపీ వ్యాప్తంగా ఎప్పుడూ హాట్ టాపికే. రఘురామకృష్ణం రాజుపై విజయ సాయి ట్వీట్లలో ఉపయోగించే భాష అభ్యంతరకరం. ఒక్కో సారి రఘురామ కృష్ణం రాజు కూడా ఆ భాషను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ వెంటనే నాలుక కరుచుకుని నా సంస్కారం అది కాదు. రెచ్చగొట్టడం వల్లే ఆ భాష ఉపయోగించానంటూ వివరణలూ ఇచ్చుకుంటారు. అదలా ఉంచితే.. తాజాగా రఘురామకృష్ణం రాజు విజయసాయి తండ్రి హంతకుడంటూ రివీల్ చేసి సంచలనం సృష్టించారు.

విజయసాయి తండ్రి 1945లో హత్య చేశారని వెల్లడించారు. అది కూడా ఎవరినో కాదు సొంత అన్ననే అని వెల్లడించారు. విజయసాయి తండ్రి సుందరరామిరెడ్డి ఆ హత్య చేసిన సమయంలో మైనర్ అనీ అందుకే ఆయన జైల్లో చదువుకున్నారనీ రఘురామ వెల్లడించారు. విజయసాయి తండ్రి సుందరరామిరెడ్డి తన సొంత అన్నను మరో సోదరుడితో కలిసి చేసిన హత్య లో ఉరి శిక్ష పడిందని వెల్లడించారు.  

సొంత కుటుంబసభ్యుడినే  హత్య చేసిన తండ్రి క్రిమినెల్ మెంటాలిటీయే విజయసాయిది కూడా అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తాను బయటపెట్టినవన్నీ వాస్తవాలేననీ. ఒక వేళ నేను అవాస్తవాలు చెబితే వాస్తవం ఏమిటో బయటపెట్టి  విజయసాయిరెడ్డి తనపై డిఫమేషన్ కేసు పెట్టొచ్చని రఘురామ సవాల్ చేశారు.