వెరైటీ వెడ్డింగ్ కార్డ్

నలుగరికీ నచ్చినదీ నాకసలే నచ్చదులే..అన్నట్లు ఇటీవలి కాలంలో   కొత్త కొత్త థీమ్ లతో పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచే జంటల సంఖ్య ఎక్కువ అవుతోంది. థీమ్ లనే కాకుండా పెళ్లి డెకరేషన్ ల నుంచి బరాత్ ల వరకూ అన్నీ వెరైటీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మధ్య అప్పగింతల సమయంలో పెళ్లి కూతురు బుల్లెట్ బండెక్కి పాటకు డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అలాగే ఓ పెళ్లి కొడుకు సైకిల్ మీద మంటపానికి వచ్చి నెటిజన్ల మన్ననలు పొందాడు. అలాగే ఎన్నో ఎన్నెన్నో వెరైటీ పెళ్లిళ్లు. అయితే పెళ్లి విషయంలోనేనా వెరైటీ.. పెళ్లి పత్రికలో కూడా తమదైన ప్రత్యేకత చూపాలనుకున్నారో జంట. అందుకే ఒకింత క్రేజీగా ఆలోచించారు. థీమ్ మ్యారేజెస్ మాత్రమే కాదు.. థీమ్ వెడ్డింగ్ ఇన్వినేషన్ తో సర్ ప్రైజ్ చేయాలనుకున్నారు. వారి సృజనకు పదును పెట్టి స్టాక్ మార్కెట్ థీమ్ తో వెడ్డింగ్ కార్డ్ రూపొందించారు.

మహారాష్ట్రకు చెందిన ఓ జంట తన వెడ్డింగ్ ఇన్విటేషన్ ను వెరైటీగా డిజైన్ చేశారు. స్టాక్ మార్కెట్ థీమ్ తో రూపొందించిన ఆ వెడ్డింగ్ కార్డులో ఆహ్వానితులను ప్రమోటర్లుగా, ఆహ్వానితులన ఇన్వెస్టర్లుగా పేర్కొన్నారు. ఇక ఐపీవో ఇన్విటేషన్ ఆఫ్  ప్రిషియస్ అకేషన్, వివాహ వేడుకలను అంటే వివాహతేదీ, రిసెప్షన్ వంటివాటిని బిడ్డింగ్ డేట్స్ గా ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. కల్యాణ వేదిక అయితే ఏకంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ గా అభివర్ణించారు.

వివాహ విందును మధ్యంతర డివిడెంట్ పే ఔట్ గా పేర్కొన్నారు. ఈ వెడ్డింగ్ కార్డ్ సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇంతకీ తమ పెళ్లికి ఇంత వెరైటీగా, ఇన్నోవేటివ్ గా వెడ్డింగ్ కార్డు రూపొందించిన జంట ఏ ఇన్వెస్టర్లో, స్టాక్ బ్రోకర్లో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ వెడ్డింగ్ కార్డును వెరైటీగా ప్లాన్ చేసిన ఆ జంట వైద్య జంట. మొత్తం మీద తమ పెళ్లి కార్డుతోనే ఈ జంట నెట్టింట పాపులర్ అయిపోయింది.