Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...72 సిక్సర్లు, 63 ఫోర్లు! ఐపీఎల్ వండర్ కిడ్ వైభవ్‌కు మెక్‌గ్రాత్ ఫిదా!
posted on: Jun 9, 2026 10:47AM
.webp)
భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది యువ సంచలనాలు మెరిశారు, కానీ కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించడం అందరికీ సాధ్యం కాదు. బీహార్‌కు చెందిన యువ బ్యాటింగ్ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఇదే అద్భుతాన్ని చేసి చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా పేస్ లెజెండ్, ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ కోచింగ్ డైరెక్టర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఈ యువ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ బ్యాటింగ్ శైలి, ముఖ్యంగా అతని బ్యాక్‌లిఫ్ట్ చూస్తుంటే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజాలు బ్రయాన్ లారా, గ్యారీ సోబర్స్ గుర్తుకొస్తున్నారని మెక్‌గ్రాత్ కొనియాడారు. చెన్నైలో జరిగిన ఒక ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మాట్లాడిన ఆయన, వైభవ్ కనబరుస్తున్న భయం లేని ఆటతీరును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించిన ఈ టీనేజ్ సెన్సేషన్ ఇన్నింగ్స్ చూసి తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని మెక్‌గ్రాత్ అంగీకరించారు. సాధారణంగా బ్యాటర్లు తమ ఇన్నింగ్స్‌లో ఫోర్ల కంటే తక్కువ సిక్సర్లు కొడుతుంటారు, కానీ వైభవ్ గణాంకాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వైభవ్ ఏకంగా 72 సిక్సర్లు, 63 ఫోర్లు బాదడం అతని పవర్‌ఫుల్ హిట్టింగ్ సామర్థ్యానికి నిదర్శనమని, ఈ ఆటగాడు ఆధునిక క్రికెట్ గమనాన్నే మార్చేస్తున్నాడని మెక్‌గ్రాత్ ప్రశంసించారు. అవతలి వైపు ప్యాట్ కమిన్స్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ ఉన్నా సరే, ఈ యువ తరం ఆటగాళ్లు ఏమాత్రం భయపడటం లేదని, బంతి తమ జోన్‌లోకి వస్తే బౌండరీ అవతలకు పంపడమే లక్ష్యంగా ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఉపఖండం వెలుపల, ముఖ్యంగా ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా లాంటి పేస్, బౌన్స్ ఉండే విదేశీ పిచ్‌లపై వైభవ్ సూర్యవంశీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మెక్‌గ్రాత్ తెలిపారు.



.webp)


