ట్రంప్ మరో షాక్.. వీసా అప్పాయింట్ మెంట్ల నిలిపివేత.!
Published on: Wed Aug 26, 2026 9:29AM

అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న విదేశీ ప్రయాణికులకు, విద్యార్థులకు, టెక్ నిపుణులకు ట్రంప్ మరో షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దౌత్య కార్యాలయాల్లో వీసా అపాయింట్‌మెంట్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే షెడ్యూల్ అయిన పలు ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. దీంతో అమెరికా వెళ్లాలని ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసుకుని వీసా అప్పాయింట్ మెంట్ కు రెడీ అవుతున్న వారు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినం చేస్తున్నామన్న పేరుతో ఇష్టారీతిగా నిబంధనలను మార్చేస్తూ గందరగోళం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పూర్తిస్థాయి సమాచారంతో దరఖాస్తు చేసుకున్న వేల మంది పర్యటనలు, ఉన్నత చదువుల పరిస్థితిలో అనిశ్చితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారు.
వీసా అప్పాయింట్ మెంట్లను అకస్మాత్తుగా నిలిపివేయడంపై అమెరికా విదేశాంగ శాఖ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలు, కాన్సులేట్‌లలో పనిచేస్తున్న సిబ్బంది కోసం ఒక ప్రత్యేక అంతర్గత శిక్షణ కార్యక్రమం ప్రారంభించినందున ఇప్పుడు దరఖాస్తుల ప్రాసెసింగ్, అపాయింట్‌మెంట్లు నిలిపివేసినట్లు వెల్లడించింది.
రాయబార కార్యాలయాల పనితీరును మెరుగపరచి, నూతన విధానాలకు అనుగుణంగా దౌత్య సిబ్బందికి అవగాహన కల్పించడం కోసమే ఈ విరామమని వివరించింది. అయితే హఠాత్తుగా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అప్పాయింట్ మెంట్లు రద్దు చేయడం దరఖాస్తుదారులను ఇబ్బందుల్లో పడేసింది.
US Visa Appointments Paused Worldwide, America Visa Interview Cancellation, Donald Trump Immigration Rules, US Embassy Staff Training, US Visa Updates Telugu


