ఉబెర్ క్యాబ్స్ మీద నిషేధం
posted on Dec 10, 2014 10:03AM

ఉబెర్ సంస్థ నిర్వహిస్తున్న క్యాబ్స్‌ని ఎవరూ ఎక్కరాదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదరు సంస్థ నడుపుతున్న క్యాబ్స్ మీద నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న ఉబెర్ క్యాబ్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే నగరంలో తిరుగుతున్న పలు క్యాబ్‌లను తనఖీ చేస్తూ వాటికి అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉబెర్ క్యాబ్ సర్వీస్‌కి చెందని ఒక డ్రైవర్ తన క్యాబ్‌లో ఒక ఫైనాన్స్ ఉద్యోగినిపై అత్యాచారం జరిపిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఆ కంపెనీ మీద నిషేధం విధించింది. అమెరికాకి చెందిన ఈ సంస్థ ఆన్ లైన్ ద్వారా క్యాబ్ సర్వీసులను అందిస్తోంది. ఈ సంస్థ హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై నగరాలలో కూడా సర్వీసులను నిర్వహిస్తోంది. రాజధానిలో జరిగిన సంఘటన, నిషేధం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉబెర్ క్యాబ్‌ల మీద నిషేధం విధించింది.