ఏపీని వదలంటున్న వానలు.. వచ్చే నెలలో రెండు అల్పపీడనాలు!
posted on Aug 30, 2025 9:56AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ను వానలు వదలనంటున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలతో అతలాకుతలమౌతున్న ఆంధ్రప్రదేశ్ కు వచ్చే నెలలో మరో రెండు అప్పపీడనాల కారణంగా మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దశలో సెప్టెంబర్ నెలలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
సెప్టెంబర్ మూడో తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్యదిశ గా పయనించి సెప్టెంబర్ ఐదు నాటికి వాయుగుండం గా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే సెప్టెంబర్ రెండో వారంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి కారణంగా సెప్టెంబర్ మొదటి రెండు వారాలూ ఏపీకి , మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.