బండి సంజ‌య్ యాత్ర‌పై టీఆర్ ఎస్ రాళ్ల‌దాడి

అనువుగాని చోట అణ‌ కువ‌గా ఉండా ల‌న్నారు పెద్ద‌లు. పాపం బండి సంజ‌ య్‌కి ఇది అం త‌గా ప‌ట్టిం పు లేన‌ట్టుంది. అప్పుడే అధి కారంలోకి వ‌చ్చేసిన‌ట్టు సుదీర్ఘ ఉప‌ న్యాసాల‌తో ఆక‌ట్టుకుని త‌న బీజేపీకి తెలంగాణాలో మ‌హోప‌కార్యం చేయాల‌న్న అత్యు త్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే ఉన్నాయి.ఆయ‌న త‌మ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌న‌గామజిల్లా దేవ‌రుప్పుల గ్రామం లో తిరుగుతూండగా ఊహించ‌ని ప్ర‌శ్న‌ల‌కు త‌ట్టుకోలేక‌పోయారు. అక్క‌డి టిఆర్ ఎస్ అభిమానులు తిర‌గ‌బ‌డి రాళ్ల‌దాడి చేశారు. 

బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్రలో  మధ్యలో మైలారం దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా మోహరించారు. బండి సంజ య్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సంజయ్‌కి స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చారు. పోటాపోటీ నినా దాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం(ఆగ‌ష్టు 15) ఉదయం ప్రారంభమైంది. సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలం గాణా బీజేపీ అధ్య‌క్షుడు బండిసంజ‌య్ రాష్ట్రంలో వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మే అన్న ధీమాతో మ‌రిత రెచ్చిపోయి ప్ర‌సంగాలు చేయ డం ఆన‌వాయితీగా మారింద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

దేవురుప్పుల గ్రామంలో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ రాష్ట్ర యువ‌త‌కు ఎన్ని ఉద్యోగాలిచ్చాడో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇంకా విమ‌ర్శ నాస్త్రాలు సంధిస్తుండ‌గా టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త ఆయ‌న్ను మీ మోదీగారు  ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని జనంలో నుంచి వ్యక్తి నిల దీశాడు.

దీంతో ఘాటుగా స్పందించిన బండి సంజయ్ త‌న స‌హజ పంథాలో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇవ్వ‌మ‌ను, త‌మాషాలు చేస్తున్నారా? యూజ్లెస్ ఫెలోస్... తెలంగాణ ఎవరు తెచ్చారు, మీ కేసీఆర్ తెచ్చాడా. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పెన్షన్లు ఇవ్వు మను, రైతు రుణమాఫీ చేయుమను కేసీఆర్‌ని. దళితున్ని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేరు, దళితులకు మూడెకరాలు ఎం దుకు ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. 

అప్ప‌టిదాకా ఆయ‌న మాట తీరుకు  రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలు కూడా ధీటుగా స్పందించడంతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన నిర్మల మల్లారెడ్డి, రాములు కార్తీక్ తీవ్రం గా గాయపడ్డారు. వారిని పోలీసులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.