అత్త శ్రద్ధాంజలి బ్యానర్ కోసం వెళ్లి అల్లుడు మృతి
posted on Sep 17, 2025 9:52PM

అత్త మరణించింది అన్న వార్త వినగానే అల్లుడు వెంటనే శ్రద్ధాంజలి బ్యానర్ ప్రింట్ చేసుకొని బయలుదేరాడు. కానీ మధ్యలో అతన్ని మృత్యువు ఆవహించింది. ఒకే రోజు రెండు కుటుం బాల్లో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీర య్యారు. ఈ విషాదకరమైన సంఘటన వికారాబాద్ జిల్లా జరిగింది. వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలోని పూల్ మద్ది గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది.
అత్త చనిపోయిందని తెలుసుకున్న వెంటనే అల్లుడు శ్రీనివాస్ వికారాబాద్ నుండి అత్త లక్ష్మి ఫోటోతో శ్రద్ధాంజలి బ్యానర్ ప్రింట్ చేసుకొని తిరిగి పూల్ మద్ది గ్రామానికి వస్తున్న సమయంలో రోడ్లమీద ఉన్న గుంతలో బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. అయితే బైక్ వెనక నుండి స్పీడ్ గా వస్తున్న ఒక డీసీఎం రోడ్డు మీద పడి పోయి ఉన్న శ్రీనివాస్ పైనుండి వెళ్లిపోవడంతో.... శ్రీనివాస్ కు తీవ్ర గాయాలై అక్కడి కక్కడే మృతి చెందాడు
సమా చారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అత్త లక్ష్మీ ఫోటోతో ఉన్న శ్రద్ధాంజలి బ్యానర్ ను శ్రీనివాస్ మృతదేహంపై కప్పారు. ఘటనా స్థలంలో అత్త శ్రద్ధాంజలి బ్యానర్ అల్లుడి మృతదేహం పై కప్పి ఉండడం చూసిన స్థానికులు కంటతడి పెట్టుకు న్నారు. ఒకే రోజు అత్త, అల్లుడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఇద్దరు మరణిం చడంతో కుటుంబ సభ్యులు శోకస ముద్రంలో మునిగి పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.