ప్రభుత్వాన్ని కూల్చేస్తం.. వైసీపీకీ షాక్.. కేటీఆర్ పనికిరాడట.. మనదే విజయం.. టాప్ న్యూస్@ 7PM

వైసీపీ ప్రభుత్వ తీరుపై  ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..151 సీట్లు తీసుకొని వచ్చామని అన్నారు. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయన్నారు. ఆ  లెక్కన సుమారు 60 లక్షలకుపైగా ఓట్లు ఉంటాయని, ప్రభుత్వాన్ని కూల్చవచ్చని అన్నారు. 
------
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. రెండున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పుంజుకుంటోంది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో వైసీపీకి షాకిచ్చారు. సౌదరదిన్నె గ్రామానికి చెందిన 150 వైసీపీ కుటుంబాలు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. జగన్ పాలనలో ప్రజలు విసుగు చెందారని బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. 
-------
కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. మచిలీపట్నంలో తుపాకీ పొరబాటున పేలడంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయం అయింది. బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకుపోయింది. దాంతో ఆయనను హుటాహుటీన జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు కలెక్టరేట్ లోని ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా తుపాకీని శుభ్రపరిచే క్రమంలో ట్రిగ్గర్ వద్ద చేయి తగలడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నార
-------
ఆర్కే బీచ్‌ దగ్గర సముద్రం ముందుకొచ్చింది. అంతేకాదు సముద్రపు అలల తాకిడికి భూమి బీటలు వారింది. అరకిలోమీటర్‌కు పైగా భూమి కోతకు గురైంది. బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడివరకు కోతకు గురైంది. అటు చిల్డ్రన్‌పార్క్‌లో అడుగు మేర భూమి కుంగింది. పార్క్‌ సమీపంలో కూడా పది అడుగులు కుంగింది. భూమి కుంగడంతో ప్రహారీగోడ కూలింది. దీంతో అప్రమత్తమైన జీవీఎంసీ అధికారులు చిల్డ్రన్‌పార్క్‌ వైపు రాకపోకలను నిలిపివేశారు
-------
చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. అతివేగంగాడివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు కారులో మంటలు చేలరేగాయి. చిన్నారి సహా ఐదుగురు సజీవదహనమైయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. రుయా ఆస్పత్రిలో మరో మహిళ, ఐదేళ్ల చిన్నారి చికిత్స పొందుతున్నారు. మృతులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాసులుగా గుర్తించారు. చంద్రగిరి మండలం అగరాల దగ్గర ఘటనచోటుచేసుకుంది. 
------
సినీ గేయ రచయిత కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని ట్విట్టర్‌ వేదికగా ఆయన వెల్లడించారు. కందికొండ ఆరోగ్య, ఆర్థిక విషయాల గురించి తన ఆఫీసు సిబ్బంది.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో మాట్లాడి సాయం అందిస్తారని పేర్కొన్నారు. 
------
కేటీఆర్ ఐటీ మంత్రిగానే పనికొస్తారు.. మున్సిపల్ మంత్రిగా పనికిరారని కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ విమర్శించారు. సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగితే కేటీఆర్ ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. 2 ఎమ్మెల్సీల కోసం ఆరుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హుజురాబాద్ ఫలితం రిపీట్ అవుతుందన్నారు. 
--------
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు తరచుగా రాష్ట్రానికి వస్తూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ఎదురుదాడికి దిగారు. ఢిల్లీలో సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట సిద్ధూ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ ఇవాళ కాంట్రాక్టు టీచర్లు సీఎం  ఇంటివద్ద ధర్నాకు ఉపక్రమించారు. వారితో కలిసి సిద్ధూ కూడా నిరసన తెలిపారు.
----
నాగాలాండ్‌లో సైనిక సిబ్బంది కాల్పుల్లో పొరపాటు కారణంగా 14 మంది పౌరులు సహా జవాన్ మృతి చెందారు. నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.రోజు కూలీలు ప్రయాణిస్తున్న వాహనం కూడా అక్కడికి చేరింది. అయితే అందులో ఉన్న ఉగ్రవాదులే అని అనుమానంతో సైనికులు కాల్పులు జరిపారు.
-----
ముంబయి టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల లక్ష్యాన్నుంచిన కోహ్లీ సేన... విజయానికి మరో 5 వికెట్ల దూరంలో నిలిచింది. భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు.