ఏపీపై కేంద్రం సీరియస్.. బూతుల కొడాలి.. ఇ ఇద్దరూ కలిశారు..భారత్ భళా.. టాప్ న్యూస్@7PM

ఏపీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం మరోసారి సీరియస్ అయింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానిక సమాధానం ఇవ్వలేదు. ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేయడంపై వెంటనే నివేదిక పంపాలని ఏపీని కేంద్రం ఆదేశించింది. ప్రధాని కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శికి విడివిడిగా కేంద్ర గణాంకాలు, ప్రణాళికా మంత్రిత్వ శాఖ లేఖలు పంపింది
--
ఏపీలో ఆర్థిక విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తెస్తున్నారని తప్పుబట్టారు. దేశంలో ఇంతలా అప్పులు చేస్తున్న రాష్ట్రం ఏపీ తప్ప మరొకటి లేదన్నారు. ఆర్థిక విధ్వంసంపై ప్రధాని, ఆర్బీఐ బ్యాంక్‌లకు లేఖలు రాస్తానని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా అప్పులు ఇచ్చి ప్రజలను బలిపశువులు చేయొద్దని సూచించారు. 
------
అనంతపురంలో జిల్లా సమీక్ష సమావేశం ఎంపీ గోరంట్ల మాధవ్ వర్సెస్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నట్లుగా సాగింది. వరదల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనపడలేదని ఎంపీ గోరంట్ల ఆరోపించారు. తిండికి తిప్పరాజు పనికి పోతురాజు అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితిని తప్పుబట్టారు. అయిపోయిన పెళ్లికి పయ్యావుల కేశవ్ మేళం వాయించినట్టుందని మాధవ్ ఎద్దేశాచేశారు. మాధవ్ వ్యాఖ్యలపై పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరదలపై చర్చ జరుగుతుంటే తనపై వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యంతో పయ్యావుల కేశవ్ శాంతించారు.
-----
అనంతపురం జిల్లాలోని వ్యవసాయ అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడతూ అధికారులు ఎవరూ కూడా పంటల ఈ- క్రాపింగ్ చేయడం లేదన్నారు. ఈ- క్రాపింగ్‌లో ఎడిట్ ఆప్షన్ ఎక్కడ ఉందని  ప్రశ్నించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయడం లేదన్నారు. పంటలు సాగుచేసిన విస్తీర్ణం కూడా సరిగా నమోదు చేయడం లేదని రాంచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. 
----
మంత్రి కొడాలి నానికి బూతులు తప్ప ఏమీ తెలియదని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. మనిషిగా మారడానికి కొడాలి నాని ప్రయత్నించాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్లపై సాష్టాంగపడే కొడాలి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. తనను విమర్శించే అర్హత కొడాలి నానికి లేదని హెచ్చరించారు. ‘‘ఓడినా, గెలిచినా.. నేను నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉంటా. నీలా ఊరకుక్కలా పార్టీల వెంట పరిగెత్తి గెలిచి.. బూతుల మంత్రి, బుద్ధిలేనివాడని పేరు తెచ్చుకోలే అని వర్గ రామయ్య అన్నారు. 
-----
వరి కొనకపోతే ప్రదాని మోదీ, సీఎం కేసీఆర్‌కు ఉరివేయడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద వరి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనకపోతే కేసీఆర్‌ గద్దె దిగాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఈ రాత్రి ధర్నాచౌక్‌లోనే నిద్రిస్తామని ప్రకటించారు. రైతుల మృతికి సీఎం కేసీఆర్‌ కారణమని దుయ్యబట్టారు. వరి కుప్పలపైనే రైతు గుండె ఆగిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదని తప్పుబట్టారు.
-----
టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్సీలుగా నిలుచున్న భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ ఎక్కడైనా, ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా అని సీఎం కేసీఆర్‌ను కరీంనగర్ మాజీ మేయర్, కార్పొరేటర్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల సమస్యలపై ఎప్పుడైనా భాను ప్రసాద్ మాట్లాడాడా అని ఆయన నిలదీశారు. 24 గంటల్లోనే కలెక్టర్ వెంకట్రామా రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఉద్యమకారులను పక్కబెట్టడం ఏంటన్నారు. డబ్బుల సంచులతో వచ్చి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
------
ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీని ప్రభావం ఇప్పుడు క్రీడారంగంపైనా పడింది. జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ కూడా కొత్త వేరియంట్ ప్రభావంతో నిలిచిపోయింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో అనేక ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తుండడంతో టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చేసింది. 
---
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  సభ్యుల సంక్షేమమే తమకు పరమావధి అని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి స్పష్టం చేశారు. 'మా' సభ్యుల ఆరోగ్యం, వైద్య చికిత్సల కోసం తాము పని ప్రారంభించామని, హైదరాబాదు నగరంలోని ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల సౌజన్యంతో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, బిల్లుల్లో రాయితీలు లభిస్తాయని వివరించారు.
--
న్యూజీలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్సులో భారత్ కు 49 పరుగుల కీలక ఆధిక్యత లభించింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు 1, అశ్విన్ కు 3 వికెట్లు లభించాయి. పేసర్ ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. 
---